వీరభద్ర ఉత్సవాలు ప్రారంభం
కడప : రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ సంప్రదాయాల ప్రకారం ధ్వజారోహణంతో నిర్వాహకులు ఉత్సవాలు ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా యాగశాల ప్రవేశం, మహాగణపతి పూజ, దీక్ష హోమం నిర్వహించారు. శుక్రవారం క్షేత్ర పాలక కాల భైరవ హోమం, అభిషేకాలు, కల్యాణోత్సవం నిర్వహించారు.రాత్రికి పుల్లంగి సేవ నిర్వహిస్తారు.
News Posted: 11 February, 2010
|