కడప : ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ గురువారం ఉదయం కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. దర్గా మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. దర్గాను దర్శించుకున్న తరువాతే తన పేరు గిన్నీస్ బుక్ లో చేరిందని గజల్ శ్రీనివాస్ అన్నారు. పెద్ద దర్గా మత సామరస్యానికి ప్రతీక అని శ్రీనివాస్ అభివర్ణించారు.