కడప : జిల్లాలోని ప్రొద్దుటూరు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మంగళవారం గోడపై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆతనికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రొద్దుటూరు గడ్డంవారి పల్లికి చెందిన చిన్నసుబ్బారాయుడు హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. మతిస్థిమితం సరిగా లేనందున ఆతను ఈ ఘటనకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.