కల్తీసారాకు 11 మంది బలి
రాజమండ్రి : కోనసీమలో కల్తీసారా తాగి 11 మంది మృత్యువాత పడ్డారు. అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో రెండు రోజుల క్రితం నాటుసారా తాగి కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించగా, వారిలో ఏడుగురు చికిత్స పొందుతూ మరణించారు. మంగళవారం తెల్లవారుజామున మరో నలుగురు కూడా మృతి చెందారు. తాగిన వారు చనిపోతున్నప్పటికీ, గ్రామంలో నాటుసారా అమ్మకాలు మాత్రం దగ్గడం లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News Posted: 26 January, 2010 Be first to comment on this News / Article!
|