TeluguPeople
  are the trend-setters
 
Astrology: Weekly and Yearly Predictions by Sign

March 2009 - March 2010 rASi falAlu

కర్కాటకం (పునర్వసు 4పా, పుష్యమి, ఆశ్లేష) ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 3, అవమానం - 3 ఈ రాశి వారికి గురుడు మే 1 వరకు సప్తమ స్థానమైన మకరం, తదుపరి జూలై 30 వరకు, అష్టమ స్థానమైన కుంభం, తిరిగి డిసెంబర్ 19 వరకు వక్రగతిన మకరంలోనూ, అనంతరం కుంభ రాశిలో సంచారం. శని సెప్టెంబర్ 9 వరకు, ద్వితీయ స్థానమైన సింహం, తదుపరి తృతీయ స్థానమైన కన్యారాశిలో సంచారం. రాహు, కేతువులు నవంబర్ 19 వరకు సప్తమమైన మకరం, జన్మరాశి కర్కాటకం, తదుపరి షష్ఠమ స్థానమైన ధనుస్సు, వ్యయ స్థానమైన మిథునరాశి యందు సంచారం. ఈ రాశి వారికి సెప్టెంబర్ వరకూ ఏల్నాటి శని దోషం ఉన్నా మొత్తం మీద గత ఏడాది కంటే మెరుగ్గా ఉంటుంది. దూరమైన సన్నిహితులు దగ్గరవుతారు. మిశ్రమ ఫలాలు ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్థి వృద్ధి. కోర్టు వ్యవహారాలలో ప్రతిష్ఠంభన, గతంలోని రుణాలు తీరే అవకాశాలు. బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సెప్టెంబర్ నుంచి ఇంకా అనుకూల స్థితి ఉంటుంది. సోదరుల నుంచి ధన, ఆస్తి లాభ సూచనలు. విలువైన వస్తువులు కొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు దక్కుతాయి. వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లు చిక్కుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు ఉంటాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. సాంకేతిక, పారిశ్రామిక రంగాల వారికి కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వైద్య వృత్తిలోని వారికి బాగా కలిసివచ్చే కాలం. వీరు గురు, కేతువులకు జపాలు చేయించుకోవడం మంచిది. దత్తాత్రేయ స్తోత్రాలు, గాయత్రీ జపం వల్ల చికాకులు తొలగుతాయి. అదృష్ట సంఖ్య - 2 అనుకూల సంఖ్యలు - 1, 3 వీరు ముత్యం ధరిస్తే మంచిది. చైత్రం : ప్రయత్నాలలో అవరోధాలు, దూరప్రయాణాలు, ధనవ్యయం, వ్యయప్రయాసలు, ఒప్పందాలు, పునః సమీక్ష. వైశాఖం : వ్యాపార వృద్ధి. ధన, వస్తు లాభాలు. శుభకార్యాల రీత్యా ధన వ్యయం. కోర్టు వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. జ్యేష్ఠం : వ్యాపారాలలో బాగా కలసి వస్తుంది, అప్రయత్న కార్య సిద్ధి, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి, వాహనయోగం. ఆషాఢం : కుటుంబ సభ్యులతో కలహాలు, రాజకీయ, వ్యాపార రంగాల వారికి పరీక్షాకాలం, ఆర్థిక ఇబ్బందులు, రుణ వత్తిడులు. శ్రావణం : కుటుంబ సభ్యులతో వివాదాలు, ధనవ్యయం, అనారోగ్య సూచనలు, బంధువుల నుంచి వత్తిడులు, ఒప్పందాలు రద్దు. భాద్రపదం : శత్రువులు పెరుగుతారు, బంధు విరోధం, కార్యక్రమాలలో జాప్యం, మానసిక అశాంతి, ఆకస్మిక ప్రయాణాలు. ఆశ్వయుజం : వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం, స్థిరాస్తి వృద్ధి, విలువైన వస్తువులు కొంటారు, గృహ, వాహన యోగాలు. కార్తీకం : ధనలాభం, బంధువులతో సఖ్యత, శుకార్యాల గురించి ఆలోచన, గృహనిర్మాణ యత్నాలు, కొత్త ఉద్యోగ యత్నాలు. మార్గశిరం : వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. శ్రమాధికం, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి. చర్చలలో పురోగతి. పుష్యం : వృత్తి, వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది, కొత్త వస్తు లాభాలు, ఆర్థిక వృద్ధి, విందు, వినోదాలలో పాల్గొంటారు. మాఘం : కొత్త వ్యాపారాలకు శ్రీకారం, గృహ, వాహన యోగం, ధనలాభం, బాకీలు వసూలు, ఆరోగ్య సమస్యలు, ఆకస్మిక ప్రయాణాలు. ఫాల్గుణం : ధనలబ్ధి, గౌరవం పెరుగుతుంది, కొత్త పరిచయాలు, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం.

Subham&astu


mI rASiphalAlu telusukunEMduku

mI rASi gurtupei klik` chEyaMDi


Aries Taurus Gemini Cancer Leo Virgo
Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces




News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training