TeluguPeople
  are the trend-setters
 
Astrology: Weekly and Yearly Predictions by Sign

March 2009 - March 2010 rASi falAlu

మీనం (పూర్వాభాద్ర 4పా, ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయం - 5, వ్యయం - 14, రాజపూజ్యం - 6, అవమానం - 5 ఈ రాశి వారికి గురుడు మే 1 వరకు లాభస్థానం మకరంలోనూ, తదుపరి వ్యయస్థానం కుంభంలోనూ, జూలై 30 నుండి డిసెంబర్ 19 వరకు లాభస్థానమైన మకరం, అనంతరం కుంభంలోనూ సంచారం. శని సెప్టెంబర్ 9 వరకు షష్ఠమమైన సింహంలోనూ, తదుపరి సప్తమస్థానం కన్యారాశిలోనూ సంచారం. రాహు కేతువులు నవబంర్ 19 వరకు లాభస్థానం మకరం, పంచమస్థానం కర్కాటంలోనూ, తదుపరి దశమ స్థానం మకరం, చతుర్థస్థానమైన మిథునంలోనూ సంచరిస్తారు. ఈ రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు, గృహనిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్థి వృద్ధి. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. కోర్టు వ్యవహారాలలో సానుకూలత. బంధు, మిత్రులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి. ఆశించిన బదిలీలు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి కొత్త అవకాశాలు. వ్యవసాయదారులకు పంటలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. కళాకారులకు సన్మానయోగం. కుటుంబ విషయాలలో చికాకులు తొలగుతాయి. కాంట్రాక్టర్లకు కొత్త పనులు దక్కుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్యపరంగా కాస్త మెలకువ అవసరం. స్త్రీలకు కూడా సంతోషకరంగా గడుస్తుంది. హనుమాన్ ఛాలీసా, ఆదిత్యహృదయం పఠించాలి. అదృష్ట సంఖ్య 3 అనుకూల సంఖ్యలు 1, 2, 9 వీరు పుష్యరాగం ధరించాలి. చైత్రం : శుభకార్యాలలో పాల్గొంటారు, సంఘంలో గౌరవం, పలుకుబడి పెరుగుతుంది, స్థిరాస్తి వృద్ధి. వైశాఖం : వ్యాపారాలలో పురోగతి, రాబడి పెరుగుతుంది, సమస్యలు పరిష్కారం, కుటుంబసౌఖ్యం. జ్యేష్టం : పనులలో ఆటంకం, ధనవ్యయం, పనులు మందగిస్తాయి, శ్రమాధికం, వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఆషాఢం : కోర్టు వ్యవహారాలు తప్పవు, పనులు మందగిస్తాయి, అనారోగ్యం, వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు, ప్రయాణాలు. శ్రావణం : పనులలో అనుకూలత, ఆర్థికాభివృద్ధి, వ్యాపారాలలో లాభాలు, ఆహ్వానాలు, పెట్టుబడులు అందుతాయి, శ్రమ ఫలిస్తుంది. భాద్రపదం : ఆర్థిక ఇబ్బందులు, కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి, శ్రమ పెరుగుతుంది, బంధు, మిత్రులతో వైరం. ఆశ్వయుజం : మిత్రుల సహకారం, ఆర్థిక ప్రగతి, పనులలో విజయం, ఆకస్మిక ధనలబ్ధి, ఉద్యోగయోగం. కార్తీకం : వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, గృహ నిర్మాణ యత్నాలు, అనుకోని అవకాశాలు, కొత్త పరిచయాలు. మార్గశిరం : కుటుంబసౌఖ్యం, శుభకార్యాలలో పాల్గొంటారు, మిత్రుల కలయిక, ఇంటా బయటా ప్రోత్సాహం, ఆస్తిలాభం. పుష్యం : వ్యాపారాలలో అభివృద్ధి, శుభకార్యాలలో పాల్గొంటారు, చిన్ననాటి మిత్రులను కలుస్తారు, దైవదర్శనాలు. మాఘం : ఉద్యోగాలలో మార్పులు, రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వాహనయోగం. ఫాల్గుణం : కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, వాహనాలు, ఆభరణాలు కొంటారు, శ్రమకు ఫలితం దక్కుతుంది, పనులలో విజయం.

Subham&astu


mI rASiphalAlu telusukunEMduku

mI rASi gurtupei klik` chEyaMDi


Aries Taurus Gemini Cancer Leo Virgo
Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces




News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training