వృషభం (కృత్తిక 2, 3, 4 పా, రోహిణి, మృగశిర 1, 2పా)
ఆదాయం - 11, వ్యయం - 14, రాజపూజ్యం - 4, అవమానం - 7
ఈ రాశి వారికి గురుడు 5 మే 2009 వరకు భాగ్యస్థానం మకరంలోనూ, తదుపరి దశమ స్థానం కుంభంలోనూ, తిరిగి జూలై 30 నుండి డిసెంబర్ 19 వరకు వక్రగతిలో భాగ్యస్థానం మకరంలోనూ, తదుపరి కుంభరాశిలో సంచారం. శని సెప్టెంబర్ 9 వరకు చతుర్థస్థానం సింహంలోనూ, తదుపరి పంచమస్థానం కన్యారాశి యందు సంచారం. రాహు, కేతువులు నవంబర్ 19 వరకు భాగ్యస్థానమైన మకరం, తృతీయ మైన కర్కాటకంలోనూ, తదుపరి అష్టమ స్థానమైన ధనుస్సు, ద్వితీయ స్థానం మిధునంలోనూ సంచరిస్తారు.
ఈ రాశి వారికి గ్రహస్థితి సామాన్యంగా ఉంటుంది. అర్ధాష్టమ శని దోషం ఎక్కువగా ఉన్నందున పనులలో జాప్యం. మానసిక అశాంతి. బంధువైరం. తరచూ ప్రయాణాలు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. నూతన వ్యక్తుల పరిచయం, వారి సహకారం లభిస్తుంది. సంతాన పరంగా చికాకులు ఎదుర్కొంటారు. క్లిష్టమైనప్పటికీ కొన్ని కార్యక్రమాలు చేపట్టి ముందడుగు వేస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెంపొందుతాయి. శ్రమాధికంతో కార్యజయం. విద్యార్థులకు, నిరుద్యోగులకు గతంలో కంటే మెరుగైన అవకాశాలు, ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలలో లాభాలు ఆశించినదాని కంటే తక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు కొంత వెసులుబాటు, కోరుకున్న బదిలీలు. సాంకేతిక రంగంలోని వారికి పూర్వ వైభవం కలిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, కళాకారులకు ప్రజాదరణ అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. నరాలు, ఉదర సంబంధ వ్యాధులు బాధిస్తాయి. అవివాహితులకు వివాహయోగ కాలం. వీరు శనికి తైలాభిషేకం, రాహు కేతువులకు జపాలు, దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించుకోవాలి.
అదృష్ట సంఖ్య 6
అనుకూల సంఖ్యలు 5, 7
వీరు వజ్రం ధరించాలి.
చైత్రం : అనుకోని ఖర్చులు, విందులు, కంటి సంబంధ వ్యాధులు, వ్యాపారాలు మందగిస్తాయి.
వైశాఖం : ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు, దూర ప్రయాణాలు, ఒత్తిడులు పెరుగుతాయి.
జ్యేష్టం : ఉద్యోగాలలో పదోన్నతులు, ఆర్థికాభివృద్ధి, కీలక నిర్ణయాలు, తీర్థయాత్రలు.
ఆషాఢం : పనులు విజయవంతంగా పూర్తి కాగలవు, ఆర్థికాభివృద్ధి, ధన, వస్తు లాభాలు, ప్రయత్నాలు ఫలిస్తాయి.
శ్రావణం : అనుకోని విరోధాలు, ప్రయాణాలు వాయిదా, ఆరోగ్య భంగం, మానసిక అశాంతి.
భాద్రపదం : బంధువులతో విరోధాలు, వ్యాపారాలలో ఒత్తిడులు, ధన నష్టం, స్ర్తీ మూలక సహాయం, రుణ బాధలు.
ఆశ్వయుజం : రుణ బాధల నుంచి విముక్తి, ఆదాయం పెరుగుతుంది, ఆహ్వానాలు, శుభకార్యాలు.
కార్తీకం : వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి ఇబ్బందులు, రుణాలు చే్స్తారు, శ్రమాధికం, ధన నష్టం.
మార్గశిరం : బంధువులతో వివాదాలు, వ్యాపారాలు నిరాశపరుస్తాయి, ఆకస్మిక బదిలీలు, మానసిక ఆందోళన.
పుష్యం : పాత మిత్రుల కలయిక, సంఘంలో గౌరవం, పెద్దల సలహాలు పొందుతారు, విదేశీ పర్యటనలు.
మాఘం : వ్యాపారాలలో పురోగతి, ధన లాభం, ఆస్తి వివాదాల పరిష్కారం, శ్రమకు ఫలితం దక్కుతుంది.
ఫాల్గుణం : అధికారులతో వివాదాలు, ఉద్యోగ మార్పులు, వ్యవహారాలు మందగిస్తాయి.
|