Active Blogs | Popular Blogs | Recent Blogs చిన్న , పెద్ద , పేద , ధనిక అనే భేధం లేకుండా చేసుకునే పండుగ గణేష పండుగ .సంవత్సరానికి ఒక సారి జరుపుకునే పండుగ అని శక్తి కొద్ది జరుపుకుంటారు .. కాని మా ఊర్లో మాత్రం రెండు నెలలు జరుపు కుంటారు ఎలాగ అంటారా ..పండుగ ముందరి నెలలో వస్తుంది అంటే ఈ నెల నుంచి పిల్లలు చేతిలో చిన్న చిన్న బుక్కు లతో కనిపిస్తారు డొనేషన్ వసూలు చెయ్యడానికి అన్న మాట . ప్రతి రోడ్ లోను ఆ రోడ్ లో పిల్లలు కలసి పెడతారు ..ఇళ్ళకు వెళ్ళి చందాలు వసూలు చేస్తారు నిన్ననే కదా ఇచ్హాం అన్నాం అనుకోండి అది వేరే అసోసిఏ షన్ అంటె రోడ్ కి ఒక అసోసిఏ షన్ అన్న మాట .. దానికి పేర్లు కూడా ఉంటాయి ..ఇలా నెల మొత్తం వసూళ్ళ కార్యక్రమం అంటె రోజంతా కాదు స్కూల్ కి వెళ్ళాలి కదా సాయంత్రం మాత్రం పార్ట్ టైం జాబ్ లా చేస్తారు .
పండుగ రోజు రానె వస్తుంది .ఆ రోజు అందరు ఇళ్ళలో పెడతారు మరసటి రోజు నుంచి ప్రారంభం అవుతుంది ఇంత వరకు బాగానె ఉంది రోడ్ లో పెట్టడం. మొదట్లో మాకు ఉత్సాహం గానే ఉండేది చూడడం అంత పెద్ద గణేష అని ..దేవుడికి మంత్రాలకు బదులు పెద్ద శబ్దం తో సినిమా పాటలు ..ఇంక ఆ శబ్దాలు భరించడం ఒక శిక్ష ఆ రోడ్ వాళ్ళకు ఎలా అంటారా ఆ రోజు బుల్లి తెర ప్రోగ్రాం లు చూడడం కుదరదు ఈ శబ్ద కాలుష్యం వల్ల ..మాట్లాడడం కూడా పెద్ద శబ్దం తో మాట్లాడితే కాని అర్థం కాదు పోయిన సంవత్సరం మా రోడ్ లో పిల్లల మధ్య విభేధాలు వచ్హి రెండు గ్రూప్ లు గా విడిపోయారు ..ఒకే రోడ్ లోనే రెండు గణేషాలు మడ్య రోడ్ లో అటు వైపు చూస్తు ఒక గణేష ..ఇటు వైపు చూస్తు ఒక గణేష ఇద్దరికి పోటి పాటలు పెట్టడంలో ఇంక ఈ సంవత్సరం ఎలా చేస్తారో అనుకుంటూనే ఉన్నా నిన్న పొద్దున ఒక గ్రూప్ వాళ్ళు పెట్టారు ఇంక అటు వైపు వెళ్ళడం కస్టం అని ఇంకో వైపు వెళ్ళాం ..సాయంత్రం వచ్హేసరికి ఇంకో వైపు వాళ్ళు ఆ చివరన పెట్టేసారు ఈ సారి కొంచం ఇంప్రూవ్ మెంట్ ఈ చివర ఒకరు ఆ చివర ఒకరు .. అక్కడ ఉన్న పిల్లవాణ్ణి అడిగా ఇంటికి ఎలా వెళ్ళాలి ఇలా గణేషాలు పెట్టేస్తే .. ఆ గడుగ్గాయి ఆంటీ ఇటు వెళ్ళి అటు తిరిగి లెఫ్ట్ లో కట్ చేసి రైట్లో వస్తే మీ ఇంటికి కి ఈజీ గా వచ్హేయచ్హు అంటు ఒక ఉచిత సలహా పడేసాడు .. నీ బోడి సలహా నాకు ఏం వద్దు అన్నట్లు ఒక చూపు చూసాను ..వాడికి అర్థం అయింది అనుకుంటాను సంవత్సరానికి ఒక సారే కదా ఆంటీ పెడతాము మీరే సహకరించకుంటె ఎలా అంటు ఇంక చేసేది లేక వెనక్కు తిరిగాను .వాడు చెప్తూనే ఉన్నాడు రేపు 12 గంటలకు పూజకు రండి అంటూ ఆహ్వానం ..5 నిమిషాల్లో చేరే గమ్యానికి అరగంట పట్టింది చుట్తి చుట్టి ఇల్లు చేరే సరికి ఆ చుట్టిన అలసటలో విసుగు కోపం వచ్హింది ..ఎవరి మీద ప్రదర్శించాలో తెలియక
పెన్ను పేపర్ తీసుకుని నా విసుగుని , కోపాన్ని రాసేసా ..
నాకే అదికారం ఉంటే ఇలా రోడ్ లో గణేషాలు పెట్టకూడదు అని చట్టాం పెట్టేదాన్ని .ఇది నా ఒక్కరి సమస్య కాదు అందరికి ఇబ్బందే ..అందరు సర్దుకు పొవడమే అలవాటు చేసుకున్నారు
అయినా ఈ సర్దుకు పోవడం మనకు కొత్త ఏమి కాదు కదా .. పాలకులు అంతటి వాళ్ళే అదిరి పోయే వాగ్దానాలు చేసి ఐదు ఏళ్ళ పాటు షడ్రషొపేత బోజనం పెట్టినట్లు బ్రమ కలిగిస్తారు అది ఎలాను జరగదు అని తెలుసు అయినా మనం సర్దుకు పోతున్నాం కదా ..గణేష పండుగ ఒక రోజే కదా ..అందరితో పాటు మనము జై గణేష అంటే సరిపోతుంది ...గణేషకి కోపం వచ్హినా వస్తుంది నేను జై గణేష అనేస్తాను . జై గణేష ..జై జై గణేష
ఈ ఆవేదన గణేషాకు అర్థం అయితే చాలు
rao srini | chala bhagundhi.....nice one
Posted at: 4, Sep 2011 5:21 AM |
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|