poems in devender at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Devender Chintala Devender's Blogs >> devender

poems

ప్రేమన కరుణవి నీవు
సుమాన సుధవి నీవు
నగలోన శోభవు నీవు
అందాన ఆనందం నీవు
జీవిలోని జీవం నీవు
ఆత్మన పరమాత్మ నీవు
గాయాన సేదవు నీవు
గేయాన శృతివి నీవు
అమ్మ అనురాగం నీవు
నాన్న మమకారం నీవు
పేదోడి స్వేదానివి నీవు
గీతలోని వేదం నీవు

నో చాన్స్!
రవి రోజూ ఉదయిస్తున్నా
రోజురోజుకీ నాలోని కవి
కనుమరుగవుతున్న వైనం
నా అంతరంగాన ప్రస్ఫుటమవుతున్న
బాధ అంతా యింతా కాదు.
ప్రేయసి తన ప్రేమని పంచనంతవరకూ
దైవం తన కరుణని ప్రసాదించనంతవరకూ
మిత్రుడు తన మైత్రిని బహిర్గతపరచనంతవరకూ
శత్రువు సైతం తన ఉనికిని తెలపనంతవరకూ

సంధ్యాసంధ్యల్లో సాగర కెరటాలు
తన సోయగాలని ఆవిష్కరించనంతవరకూ
నాలో నేను రసస్పందన పొందనంతవరకూ
ప్రకృతి తనదైన ఆకృతితో
నా హృదిని చైతన్యపరచేంత వరకూ
నాలోని కవితాత్మ
అంకురించను
అక్షరించను
అని మొండికేసింది
అక్షరం సైతం సూక్ష్మంగా
నాలో నిక్షిప్తమై
లిప్తంగా ఉంటానంటుంది
కలకాలం అండగా నిలవాల్సిన అక్షరం
నాందీ ప్రస్తావనకి కూడా హుళక్కి చెప్తూ
కలకలం రేపుతున్న
కలం మాత్రం మౌనసాక్షిగా నిలచింది.

మనసెందుకో చాంచల్యమౌతుంది
ఏ భావనలూ,
ప్రకంపనలూ, ఘటనలూ
సంఘటనలూ లేవే
ఏవిటీ విచిత్రం?
మనసు చెదిరితే
ఓ కవితకి అంకురార్పణ
అదే మనసు ఆహ్లాదపడితే
ఓ కథకి ప్రేరణ
మనసు ఖాళీ అయితే మట్టుకు
కథకీ,
కవితకీ
నో చాన్స్!

ధన్యత
ఈ సుఖము చాలదా
ఈ జన్మ ధన్యత నొందదా
శ్రీ వేంకటేశుడి సేవన

ఈ సుఖము చాలదా
ఈ జన్మ ధన్యత నొందదా
శ్రీ రామ నామ స్మరణన

ఈ సుఖము చాలదా
ఈ జన్మ ధన్యత నొందదా
మహాదేవుడి అభిషేకమున

ఈ సుఖము చాలదా
ఈ జన్మ ధన్యత నొందదా
హరిని మదిన నిలిపిన

ఈ సుఖము చాలదా
ఈ జన్మ ధన్యత నొందదా
సాయిసేవన ధ్యాస నిలిపిన

ఈ సుఖము చాలదా
ఈ జన్మ ధన్యత నొందదా
మకరజ్యోతిన అయ్యప్పని గాంచిన!

పరకాయ ప్రవేశం


నాదైన జీవితం నిదానంగా
ప్రగతి నినాదమై నన్ను శాసిస్తుంది
నాది కాని జీవితం
జీతంలోని హెచ్చుతగ్గుల్ని
బేరీజు వేసుకుంటుంది
మొదటి జీవితం
రెండో దాన్తో సంయమనం కాలేక
రోజూ ఊగిసలాడ్తుంది
పట్టూ విడుపులకి చాన్సే లేదన్నట్టుగా.
నాలో నేను తర్కించుకునే వేళ
నాలో నేను ఆవహించుకునే తరుణాన
నాలో లేని నేను కోసం
నిరంతరం అన్వేషణ.
శోధిస్తే గాని లభ్యమవదని తెల్సి కూడా
నాలోని అహం,
నాలోని బద్ధకం మూలాన
మూలాల్లోకి వెళ్తే గాని
నన్ను నేను తెల్సుకోలేను
నాకు నేను అవగతం కాలేను.
నాలోని జ్ఞాపకాలు
ఒక్కొక్కటిగా రూపుమాసిపోతున్నాయి
అందుకే కావాలి
నాలో నేను పరకాయ ప్రవేశం


వైకుంఠపాళి

నిద్రా చావు రెండూ ఒకటే
చావులో ఉన్నంత హాయి
నిద్రలోనూ ఉంది.
కలగన్నావా
అది ఓ మంచి నిద్రౌతుంది
బతుకు అల్లకల్లోలమైందా
బతుకే చావుకి దారితీస్తుంది
నిద్రనేది భగవంతుడిచ్చిన గొప్ప వరం
చావనేది జీవితానికి చరమగీతమౌతుంది
చావు బతుకుల మధ్య సంఘర్షణే జీవితం.
సంతాన, సంసార, సౌశిల్యాలతో
సాఫల్యమొందావా జన్మ ధన్యమౌతుంది
అదే మోక్షానికి హేతువౌతుంది
కాదూ కూడదంటే
జన్మ పునరావృతమౌతుంది
పాప పుణ్యాల జమాబందిలో
ఏ జన్మనేది తేలిపోతుంది
భయం
భయపడ్డావా
నీ నీడే నిన్ను భయపెడ్తుంది
భయం వీడావో
నీ నీడ సైతం
నిన్ను చూసి వణుకుతుంది.

భయమనేది
బలహీనుడి సొత్తు కాదు
ఎవడి సొత్తో కాజేస్తే
ఎవణ్ణో మాయమాటల్తో బుకాయిస్తే
భయం జనిస్తుంది

అది ఇంతింత వటుడైనట్టుగా
నిన్ను దహించుకూ తింటుంది
మెల్లిమెల్లిగా.

ధైర్యం, నిబద్ధత తోడైతే
భయాన్ని వీడడం తేలికౌతుంది

మోక్షం

మరువం మరువం
శ్రీ హరి నామం

వదలం వదలం
శ్రీ హరి పాదం

మధురం మధురం
శ్రీ హరి వదనం

కదలం కదలం
శ్రీ హరి సదనం

ప్రణవం ప్రణవం
శ్రీ హరి అభయం

శరణం శరణం
శ్రీ హరి చరణం

దివ్యం దివ్యం
శ్రీ హరి గానం

తథ్యం తథ్యం
శ్రీ హరి కడ మోక్షం

బాల్యం విలువ

గడచిపోయిన నా బాల్యాన్ని
కరిగిపోయిన కలల్లో
ఆవిష్కరించాను నా బాబుకి.
మాయమైపోయిన అనుభూతుల్ని
అవలోకనం చేశాను నా బాబుకి.
అపురూపమైన నా బాల్యాన్ని
ఆనందంతో వెల్గిపోతున్న నా ముఖంలో
ఆస్వాదించమని.
తీపి చేదు అనుభవాల
సతమతంలో ముడతలు పడ్డ
నా ముఖ కవళికల్ని
చూసి నవ్వాడు నా బాబు
కనబడని
వినబడని
కనీసం ఆనవాళ్ళు సైతం లేని
నా బాల్యాన్ని చూసి.
కంప్యూటర్నే ప్రపంచం చేసుకున్న
వాడికేం తెల్సు
నా బాల్యం, బాల్యం విలువ
.బాల్యం విలువ
-
గడచిపోయిన నా బాల్యాన్ని
కరిగిపోయిన కలల్లో
ఆవిష్కరించాను నా బాబుకి.
మాయమైపోయిన అనుభూతుల్ని
అవలోకనం చేశాను నా బాబుకి.
అపురూపమైన నా బాల్యాన్ని
ఆనందంతో వెల్గిపోతున్న నా ముఖంలో
ఆస్వాదించమని.
తీపి చేదు అనుభవాల
సతమతంలో ముడతలు పడ్డ
నా ముఖ కవళికల్ని
చూసి నవ్వాడు నా బాబు
కనబడని
వినబడని
కనీసం ఆనవాళ్ళు సైతం లేని
నా బాల్యాన్ని చూసి.
కంప్యూటర్నే ప్రపంచం చేసుకున్న
వాడికేం తెల్సు
నా బాల్యం, బాల్యం విలువ.

మకర సంక్రమణం
బాంబుల్ని పోలిన గొబ్బిళ్ళని
గుమ్మం ముందు పెట్టారెందుకని
పొద్దున్నే వార్నింగిచ్చెళ్ళాడు పోలీసు.

గంగిరెద్దులా రోజూ
అమ్మ ముందు తలాడించే నాన్న
ఆ రోజూ తలాడించేడు
డూడూ బసవన్నలా.

మకర సంక్రమణం మాట
దేవుడెరుగు
మతిభ్రమణం మాత్రం
తప్పనిసరైంది
గాలిపటాల్ని
గాల్లోకెగరేసే చిన్నాడు
నామాట సైతం గాల్లో వదిలేశాడు.

హరిదాసులు, బుడబుక్కలవారు
ఒక్క సంక్రాంతి నాడేం
ప్రతిదినం వివిధ రూపాల్లో
మన చుట్టూ భూభ్రమణం
చేస్తూనే ఉంటారు.

మనం కూడా హరిదాసుల్లా
బాసు చెప్పిన ప్రతీపనికి
బసవన్నలా తలాదించేస్తూంటాం
బానిస బ్రతుక్కి
బాసిచ్చే ముద్దుపేరు
సిన్సియర్.

లక్ష్యసిద్ధి
-
జయాపజయాలు దైవాధీనాలు అనేది నాటి మాట
జయాపజయాలు లక్ష్యాలక్ష్యాలపై అధారమనేది నేటినిజం.
లక్ష్యసిద్ధి, చిత్తశుద్ధీ ఉంటే
విజయంగా జయం సిద్ధించి తీరుతుంది.
అలక్ష్యం, ఏమరుపాటు,
అశ్రద్ధ, సోమరితనం ఉంటే
కచ్చితంగా అపజయమే
నిలుస్తుంది హమేషా.
నవ్వుల పాలవుతుంది
నలుగురిలో నగుబాటవుతుంది.
లక్ష్యం, ఏకాగ్రతతో ఏ సమస్యనైనా
విజయ లక్ష్యం వైపు
సరిగా సంధిస్తే దూసుకుపోతుంది
విజయలక్ష్మి వరిస్తుంది సంవత్సరమంతా


నో చాన్స్! కవిత
రవి రోజూ ఉదయిస్తున్నా
రోజురోజుకి నాలోని కవి
కనుమరుగవుతున్న వైనం
నా అంతరంగాన ప్రస్ఫుటమవుతున
బాధ అంతాయింతా కాదు.
ప్రేయసి తన ప్రేమని పంచనంతవరకూ
దైవం తన కరుణని ప్రసాదించనంతవరకూ
మితృడు తన మైత్రిని బహిర్గతపరచనంతవరకూ
శతృవు సైతం తన ఉనికిని తెలపనంతవరకూ

సంధ్యాసంధ్యల్లో సాగరరకెరటాలు తన సోయగాలని
ఆవిష్కరించనంతవరకూ
నాలో నేను రసస్పందన పొందనంత వరకూ
ప్రకృతి తనదైన ఆకృతితో
నాహృదిని చైతన్యపరచేంత వరకూ
నాలోని కవితాత్మ
అంకురించను
అక్షరించను
అని మొండికేసింది
అక్షరం సైతం సూక్ష్మంగా
నాలో నిక్షిప్తమై లిప్తంగా వుంటానంటుంది
కలకాలం అండగా నిలవాల్సిన అక్షరం
నాందీప్రస్తావనకి కూడా హుళక్కి చెప్తూ
కలకలం రేపుతున్న
కలం మాత్రం మౌనసాక్షిగా నిలచింది.

మనసెందుకో చాంచల్యమౌతుంది
ఏ భావనలూ,
ప్రకంపనలూ, ఘటనలూ
సంఘంటనలూ లేవే
ఏవిటీ విచిత్రం?
మన్సు చెదరితే
ఓ కవితకి అంకురార్పణ
అదే మనసు అహ్లాదపడితే
ఓ కథకి ప్రేరణ
మనసు ఖాళీ ఐతే మట్టుకు
కథకీ,
కవితకీ
నో చాన్స్!

మగువతెగువ (కవిత)
గుల్జార్ కవితావిన్యాసం వెనుక
రాఖీ భావనాప్రభావమెంతో!
అమితాబ్ నటనాకౌశల్యం వెనుక
జయ సహాయసహకారాలెంతో!
శ్రీశ్రీ కవితాఝరి వెనుక
సరోజ సేవాతత్పరత ఎంతో!
ఎంతగా రామలక్ష్మి కృషి లేకుంటె
కమ్మనైన పాటలు ఆరుద్ర కలం విదిల్చేది!
ఎంతటి రంపపు కోతకి గురైతేగాని
ఆత్రేయ మనసుకవిత్వం గుండెల్ని
పిండి పండించి జీవితపు లోతుపాతుల్ని తెల్పింది!
తనభార్య గయ్యాళితనానికి కారణమేగా
సోక్రటీసు తనఫిలాసఫీని ప్రజలకి వినిపించగల్గింది!
ఇవన్ని మగువతెగువకి దాఖలాలేగా!






నల్లానల్లని వాడు
తెల్లనామాల వాడు
ఏడుకొండలపై కొలువై
వున్నాడు వాడు
బోసినవ్వులో
బోలెడు వరాలు కురిపిస్తాడు
నీలాలు తనవేనంటాడు
నీలో వున్న అహాన్ని
నిరోధించమంటాడు
నాలో నీవున్నావంటూ
నీవే నేనంటాడు
వాడి వైభవమేమో
వర్ణింప తగింది కాదు
పూలదండని ముడి వేయకుండానే
భుజాలపై వేసుకుంటాడు
భయం సమస్తమై భయపెట్టినప్పుడు
అభయహస్తమిచ్చి ఆదుకుంటాడు
జగతిలోనిదంతా భూమినించేపుట్టి
తిరిగి భూమిలొనేకల్సేదంటూ
దక్షిణ హస్తాన్ని చూపిస్తాడు
తనలో లీనమయ్యె తత్త్వం
పెంచుకోమంటాడు
క్షణకాలం వాడి దర్శనం
కోటిజన్మల తృప్తికి నిదర్శనం
జన్మరాహిత్యానికి సోపానం
జన్మసాఫల్యానికి బహుమానం.

సమిధనై.......
కదలిరారా తెలుగుబిడ్డ తెలంగాణకై
కార్చిచ్చులా కాలిపోనా తెలంగాణకై సమిధనై
భుజంభుజం కల్పి సాగిరారా తెలంగాణకై
లేచిరారా తెలంగాణ బిడ్డ ఉద్యమాల బాటపై
ఉద్యమించు ప్రగతిబాటన ప్రళయఘర్జనవై
నినదించు జై జై యంటూ తెలంగాణకై
నివేదించు నీ శక్తియుక్తులన్ని తెలంగాణకై
జయజయధ్వానాలతో సిధ్ధిస్తుంది తెలంగాణ అందరికై

రేఖ (కవిత)
బిందువుల సముదాయమే రేఖ
హస్తరేఖలు, నగ్నరేఖలేగా జీవనాన్ని శాసించేయి
సరళరేఖలు,లంబరేఖలు,తిర్యగ్రేఖల
చిత్రవిచిత్రవైచిత్ర రూపమే
జీవనం, జీవితం
భావమైనా,భామైనా బొమ్మైనా
పరిపూర్ణత నొందడానికి
ఆనందమైన అనుభూతే నగ్నరేఖలానిలుస్తుంది
నిబద్దత కల్గిన లక్ష్మణరేఖని
తేలికజేసేసిన సీతసైతం
రాముడికి దూరమై
అశోకవనంలో అవస్థల పాలైంది
ద్రౌపది హాస్యరేఖలేగా
అభిమానధనుణ్ణి విచలితుణ్ణిజేసి
నిండుసభన వస్త్రాపహరణకి దారిదీసింది
పర్యవసానంగా
పద్దెనిమిది అక్షౌహిణిల సైనికుల ప్రాణాలకి
మంగళం పాడేసింది కురుక్షేత్ర సంగ్రామాన.



 

Devender Chintala Devender
ఊరూరా బతుకమ్మ ఉయ్యాలో.........
రచన: చింతల దేవేందర్, కేవి నఒ.౧, ఉప్పల్ ,
హైదరాబాద్ ph.9160680095

ఊరూరా బతుకమ్మ ఉయ్యాలో
ఊరేగుతుంది ఉయ్యాలో

రామరామ ఉయ్యాలో
రాముడేలిన రాజ్యం ఉయ్యాలో
సుఖశాంతుల్తో ఉయ్యాలో

సల్లంగ వుండె ఉయ్యాలో
ధర్మమార్గాన ఏలే ఉయ్యాలో
ధర్మమే తప్పిపోయే ఇయ్యాలా
నల్లధనమంటూ ఉయ్యాలో
బైటపెట్టమంటూ ఉయ్యాలో
హర్తాలే జేసిండు ఉయ్యాలో
అన్నాహాజరే ఉయ్యాలో
మోండిగ వుంటేనే ఉయ్యాలో
సర్కారే దిగివచ్చే ఉయ్యాలో
బంగారు రాజులే ఉయ్యాలో
గాలిసోదరులే ఉయ్యాలో
జైలుపాలైరి ఉయ్యాలో
పన్నుమీద పన్నేసే ఉయ్యాలో
దాసుకుందామనుకుంటె ఉయ్యాలో
దోసుకోవట్టె ఉయ్యాలో
సేవ చేస్తమంటూ ఉయ్యాలో
గద్దెనెక్కిరి ఉయ్యాలో
అల్లకల్లోలమాయే ఉయ్యాలో
ఆగమాగమాయే ఉయ్యాలో
పిల్లల ప్రాణాలు ఉయ్యాలో
ఆత్మహాత్

Posted at: 15, Feb 2012 7:17 AM

Devender Chintala Devender
మంచుతెర (కవిత)

విషయం విశదపర్చనంతవరకూ
సంశయం సందేహంగానే మిగుల్తుంది
రావణకాష్టంలా రగిలిపోయినా
సయోధ్య సలిపితెనేగా
సద్దుమణగింది అయోద్య

.ఏదీ తేటతెల్లం కానంతవరకూ
సమస్యే
అందరి ఎదుట
దుర్భేద్యంగా నిలుస్తుంది.
ఓపిక
తీరికే గనుక వుంటే
జటిలమైన సమస్య ఏదైనా
తొలగిపోతుంది మంచుతెరలా.

Posted at: 15, Feb 2012 7:15 AM
 



 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.