గణేష సంబరాలు in SAMSKAARAM at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

uma maheeswari maheeswari's Blogs >> SAMSKAARAM

గణేష సంబరాలు

చిన్న , పెద్ద , పేద , ధనిక అనే భేధం లేకుండా చేసుకునే పండుగ గణేష పండుగ .సంవత్సరానికి ఒక సారి జరుపుకునే పండుగ అని శక్తి కొద్ది జరుపుకుంటారు .. కాని మా ఊర్లో మాత్రం రెండు నెలలు జరుపు కుంటారు ఎలాగ అంటారా ..పండుగ ముందరి నెలలో వస్తుంది అంటే ఈ నెల నుంచి పిల్లలు చేతిలో చిన్న చిన్న బుక్కు లతో కనిపిస్తారు డొనేషన్ వసూలు చెయ్యడానికి అన్న మాట . ప్రతి రోడ్ లోను ఆ రోడ్ లో పిల్లలు కలసి పెడతారు ..ఇళ్ళకు వెళ్ళి చందాలు వసూలు చేస్తారు నిన్ననే కదా ఇచ్హాం అన్నాం అనుకోండి అది వేరే అసోసిఏ షన్ అంటె రోడ్ కి ఒక అసోసిఏ షన్ అన్న మాట .. దానికి పేర్లు కూడా ఉంటాయి ..ఇలా నెల మొత్తం వసూళ్ళ కార్యక్రమం అంటె రోజంతా కాదు స్కూల్ కి వెళ్ళాలి కదా సాయంత్రం మాత్రం పార్ట్ టైం జాబ్ లా చేస్తారు .

పండుగ రోజు రానె వస్తుంది .ఆ రోజు అందరు ఇళ్ళలో పెడతారు మరసటి రోజు నుంచి ప్రారంభం అవుతుంది ఇంత వరకు బాగానె ఉంది రోడ్ లో పెట్టడం. మొదట్లో మాకు ఉత్సాహం గానే ఉండేది చూడడం అంత పెద్ద గణేష అని ..దేవుడికి మంత్రాలకు బదులు పెద్ద శబ్దం తో సినిమా పాటలు ..ఇంక ఆ శబ్దాలు భరించడం ఒక శిక్ష ఆ రోడ్ వాళ్ళకు ఎలా అంటారా ఆ రోజు బుల్లి తెర ప్రోగ్రాం లు చూడడం కుదరదు ఈ శబ్ద కాలుష్యం వల్ల ..మాట్లాడడం కూడా పెద్ద శబ్దం తో మాట్లాడితే కాని అర్థం కాదు పోయిన సంవత్సరం మా రోడ్ లో పిల్లల మధ్య విభేధాలు వచ్హి రెండు గ్రూప్ లు గా విడిపోయారు ..ఒకే రోడ్ లోనే రెండు గణేషాలు మడ్య రోడ్ లో అటు వైపు చూస్తు ఒక గణేష ..ఇటు వైపు చూస్తు ఒక గణేష ఇద్దరికి పోటి పాటలు పెట్టడంలో ఇంక ఈ సంవత్సరం ఎలా చేస్తారో అనుకుంటూనే ఉన్నా నిన్న పొద్దున ఒక గ్రూప్ వాళ్ళు పెట్టారు ఇంక అటు వైపు వెళ్ళడం కస్టం అని ఇంకో వైపు వెళ్ళాం ..సాయంత్రం వచ్హేసరికి ఇంకో వైపు వాళ్ళు ఆ చివరన పెట్టేసారు ఈ సారి కొంచం ఇంప్రూవ్ మెంట్ ఈ చివర ఒకరు ఆ చివర ఒకరు .. అక్కడ ఉన్న పిల్లవాణ్ణి అడిగా ఇంటికి ఎలా వెళ్ళాలి ఇలా గణేషాలు పెట్టేస్తే .. ఆ గడుగ్గాయి ఆంటీ ఇటు వెళ్ళి అటు తిరిగి లెఫ్ట్ లో కట్ చేసి రైట్లో వస్తే మీ ఇంటికి కి ఈజీ గా వచ్హేయచ్హు అంటు ఒక ఉచిత సలహా పడేసాడు .. నీ బోడి సలహా నాకు ఏం వద్దు అన్నట్లు ఒక చూపు చూసాను ..వాడికి అర్థం అయింది అనుకుంటాను సంవత్సరానికి ఒక సారే కదా ఆంటీ పెడతాము మీరే సహకరించకుంటె ఎలా అంటు ఇంక చేసేది లేక వెనక్కు తిరిగాను .వాడు చెప్తూనే ఉన్నాడు రేపు 12 గంటలకు పూజకు రండి అంటూ ఆహ్వానం ..5 నిమిషాల్లో చేరే గమ్యానికి అరగంట పట్టింది చుట్తి చుట్టి ఇల్లు చేరే సరికి ఆ చుట్టిన అలసటలో విసుగు కోపం వచ్హింది ..ఎవరి మీద ప్రదర్శించాలో తెలియక
పెన్ను పేపర్ తీసుకుని నా విసుగుని , కోపాన్ని రాసేసా ..

నాకే అదికారం ఉంటే ఇలా రోడ్ లో గణేషాలు పెట్టకూడదు అని చట్టాం పెట్టేదాన్ని .ఇది నా ఒక్కరి సమస్య కాదు అందరికి ఇబ్బందే ..అందరు సర్దుకు పొవడమే అలవాటు చేసుకున్నారు

అయినా ఈ సర్దుకు పోవడం మనకు కొత్త ఏమి కాదు కదా .. పాలకులు అంతటి వాళ్ళే అదిరి పోయే వాగ్దానాలు చేసి ఐదు ఏళ్ళ పాటు షడ్రషొపేత బోజనం పెట్టినట్లు బ్రమ కలిగిస్తారు అది ఎలాను జరగదు అని తెలుసు అయినా మనం సర్దుకు పోతున్నాం కదా ..గణేష పండుగ ఒక రోజే కదా ..అందరితో పాటు మనము జై గణేష అంటే సరిపోతుంది ...గణేషకి కోపం వచ్హినా వస్తుంది నేను జై గణేష అనేస్తాను . జై గణేష ..జై జై గణేష

ఈ ఆవేదన గణేషాకు అర్థం అయితే చాలు



Next > >  

paatabasti sathenna
శుభోదయం! బహునాళ్ళ దర్శనం!!మీ భావాలు....ఆలోచించదగ్గవే!ఈ సామాజిక రుగ్మతలు అందరూ ఎరిగినవే..అందరూ భరిస్తూ పోతారు..ఏ సమస్యకైనా అయితే ఎదిరించాలి..లేదా భరించాలి..ఇకపోతే..ఒక్క గణేశ మంటపాలే కాదు.పెండ్లి అయినా చావుఅయినా మరే ఇతర ఫంక్షన్ అయినా దర్జా రోడు ఆక్రమించడం ఇప్పుడు మామూలైపోయింది.మరీ ముఖ్యంగా కదలకుండా డాన్స్ లు చేస్తూ DJ sounds తో ఏవాహనాన్ని వెళ్ళనీయకుండా..వెల్లినా..సైడ్ ఇవ్వకుండా రుబాబు చేస్తూ ఇబ్బంది పెట్టడమూ మన దేశం లో మామూలే..
ఇందు కోసం మరో హజారే ఉద్యమించాల్సిందే...జై బోలో భారత్ మాతాకీ!!!!!ధన్యవాదాలతో.....

Posted at: 8, Sep 2011 10:42 PM

KRISHNA MURTHY RAYACHOTY
uma gaaru, jai ganesha antu meeru wrasina blog tho nenu ekeebhavisthunnaanu. vinayaka chavithi, dasara pandugalappudu maathram veedhikoka group tayarukaavadam, chandaalu vasoolu cheyyadam o fashion gaa maarindi. atyavasaaraala paristhithulalo, sahaaya karyakramaalalo paalgonadaaniki ee group members okkadu kooda kanapadadu.

Posted at: 8, Sep 2011 3:07 PM

abcd efgh
cant understand written telugu, but what I gather its about festivals?, another greatway to connect with our traditions is through our mythological stories... right?

Posted at: 8, Sep 2011 4:08 AM

sreenivas medepalli
uma gariki vandanalu.prathichota chandala gola undane undi.ekkuvaga ganesh statues pettithe ekkuvaga kastalu vastunnayi kaaranam traffic jam ,sound pollution,mandu babula chindulu,bakthi geethalaku badulu cinima geethalu ,matti prathimala badulu rangurangula prathimalu ila okatemiti annitini paadu chestunnaru .inka hyd lo prarambam kaledu.ee year konni chotla matti prathimalu petti vathavarana kalushyanni thaggincharu koddilo koddi anduku meedia vari sahakaram kuda undi.mee kopanni paper meeda chupadam kuda oka kale . meevari meeda chupaledu adrustam.kopam challaradaniki mee aalochana kuda chala manchidi. andolana teevratha taggi free avutaru .chala bagundi .ila konasagalinchalani krukonta mee sreenivas

Posted at: 7, Sep 2011 8:46 AM

abcd efgh
nice one... so difficult to keep in touch with your culture living out of the country....

Posted at: 6, Sep 2011 6:07 AM

c kumarchaitanya
uma garu...
chaala bagundi...
good...
tnx,
chaitanya.



Posted at: 6, Sep 2011 6:01 AM

vijaybabu challa
hmm.............yuktha garu blog bagundhi.......kani meeru ah blog lo vinayaka chavithi pandaga endhuku chesukuntam dhani poorva charithra enti ani vishleshinchalsindhi bagundedhi meeku salaha iche antha arhatha,vayasu naaku ledhu just naa opinion mathrame.........motham meedha mana chuttuprakkala vinayaka chavithi ela jarupukuntaro chaala chakkaga chepparu............bagundhi.......aina me blog paina comment chese antha scene naaku ledhu,so only compliments,...............keka annamata.
onlo vishayam andi samvatsaraniki okkasari pandaga jarupukuntamu 11 days ah 11 days ah baduggayilani anandanga jarupukonivvandi........dhaniki meeku right unte raod paina pettinchevaalu kaadhu ani anakandi..........meeru okappati chinnape...so njoi cheyanivvandi.ok
==vijay
==vijju

Posted at: 4, Sep 2011 2:05 PM

uma maheeswari maheeswari
jahnavi alochana baagane undi kaani ..edynaa ekkuva ayite visham laa avutundi ani vinnaav kadaa alaane ayindi ippudu kudaa ..sraavana maasam vachhindi ante start pandugalu ..garuda panchami, mangala gowri vratam, adi naalugu vaaraalu prati mangala vaaram , varalakshmi vratam, polala amavasya , sravanala powrnami, krishna jayanthi, gowri vratam and ganesha .ivi kaaka madyalo maa maama gaari thidi vastundi ee panduga vadaladam veelu kaadu cheyyaleka visugu vastundi .. . ivi cheyyadam kaakundaa pilichina vaalla illaku velladam vaallani mana intiki pilavadam ..adi daggara emi undaru okkokkaru ..blore traffic lo 20 km lu vellali ante min 1 hour padutundi ..inka bus ante 2 hours marachipovaali . inni kaaranalu naa aavedana vella gakkadaaniki any way thanks jahnavi

Posted at: 4, Sep 2011 12:33 PM

Jhanavi Jhanavi
Agree yukta garu ..kani ma lanti bayta unde valani adigithe ye sambaralu miss chesthunamu ..a pandaga hadavidi antha miss avuthunamu ane cheppagalamu ....basic ga keeping our vibrant culture alive ..a matram kosam kastha sadukolema eg pooja time lo ante poduna sayantramatrame aarti patalu petavachu anee alochana .


Posted at: 4, Sep 2011 7:53 AM

ForU Greekveerudu
thanks yarrrrrrrr


Posted at: 4, Sep 2011 6:21 AM
Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.