Active Blogs | Popular Blogs | Recent Blogs ఊరూరా బతుకమ్మ ఉయ్యాలో.........
ఊరూరా బతుకమ్మ ఉయ్యాలో
ఊరేగుతుంది ఉయ్యాలో
రామరామ ఉయ్యాలో
రాముడేలిన రాజ్యం ఉయ్యాలో
సుఖశాంతుల్తో ఉయ్యాలో
సల్లంగ వుండె ఉయ్యాలో
ధర్మమార్గాన ఏలే ఉయ్యాలో
ధర్మమే తప్పిపోయే ఇయ్యాలా
నల్లధనమంటూ ఉయ్యాలో
బైటపెట్టమంటూ ఉయ్యాలో
హర్తాలే జేసిండు ఉయ్యాలో
అన్నాహాజరే ఉయ్యాలో
మోండిగ వుంటేనే ఉయ్యాలో
సర్కారే దిగివచ్చే ఉయ్యాలో
బంగారు రాజులే ఉయ్యాలో
గాలిసోదరులే ఉయ్యాలో
జైలుపాలైరి ఉయ్యాలో
పన్నుమీద పన్నేసే ఉయ్యాలో
దాసుకుందామనుకుంటె ఉయ్యాలో
దోసుకోవట్టె ఉయ్యాలో
సేవ చేస్తమంటూ ఉయ్యాలో
గద్దెనెక్కిరి ఉయ్యాలో
అల్లకల్లోలమాయే ఉయ్యాలో
ఆగమాగమాయే ఉయ్యాలో
పిల్లల ప్రాణాలు ఉయ్యాలో
ఆత్మహాత్యలాయే ఉయ్యాలో
ఎటుదేలకపాయే ఉయ్యాలో
తెలంగాణ సంగతి ఉయ్యాలో
జనాన్ని పట్టిచ్చుకోక ఉయ్యాలో
పదవులల్లున్నరు ఉయ్యాలో
జనమంత సమ్మేజేసిన ఉయ్యాలో
గద్దెలైతె దిగమన్నరు ఉయ్యాలో
ఎవ్వనికోసం పుట్టిండ్రో ఉయ్యాలో
ఎందుకోసం పుట్టిండ్రో ఉయ్యాలో
మాకైతె సమజైతలేదు ఉయ్యాలో
ఊరూరా బతుకమ్మ ఉయ్యాలో
ఊరేగుతుంది ఉయ్యాలో.
Be first to comment on this Blog Post!
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|