Active Blogs | Popular Blogs | Recent Blogs ఆంధ్ర రాష్ట్రాన దృతరాష్ట్రుడి గుడ్డిప్రేమకి ఇక చెల్లు
కల్సివుంటే ఎంత కష్టమో
కత్తుల కంబళి కప్పినప్పుడే తెల్సింది
మౌనంగా ఇన్నాళ్ళు భరించాం
వివక్షతల్ని సహనంతో సహించాం
విడిపోతే ఎంత నష్టమో బేరీజు వేసుకుంటున్నారు
రాష్ట్రంలో ఇన్నాళ్ళు రాజ్యం నెరపిన రాజకీయ నాయకుల
ముసుగులోనున్న పెట్టుబడిదారులు
అధికారం, ఆధిపత్యహోరు, జోరులో
అసెంబ్లీ సాక్షిగా పైసా విదల్చమని
సీట్లు, ఓట్లు లేవని ఎగతాళి చేసి
ఎద్దేవా చేయడం వారికి పరిపాటయింది
మానసికంగా వేరైపోయాక
సమైక్యమనే సాకుతో
మోకాలడ్డుపెట్టడం ధర్మం, న్యాయం అనిపించుకోదు
రాజ్యాంగ నీడన జరిగే కనీస నిర్ణయానికి
న్యాయం చేయాలనే విజ్ణత ప్రదర్శించి
ఇరుప్రాంతాల అభివృద్ది, ఆకాంక్షల్ని
మానవీయకోణంలో ఆలోచించండి
స్వార్థం, వ్యాపార ధోరణి మాని సోదరప్రెమని చూపండి
పెడ్ద్దన్న పాత్రని పోషించి త్యాగనిరతి చూపి
చరిత్రలో దుర్యోధనుడిలా కాకుండా ధరిత్రిన ధర్మరాజులా నిలవండి.
Be first to comment on this Blog Post!
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|