DHOOPA, DEEPA, NAIVEDYA, APARAADHA KSHAMAAPANA, PRADAKSHINA in NITYA POOJAA VIDHAANAM at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

VENKAT ESWAR RAO 's Blogs >> NITYA POOJAA VIDHAANAM

DHOOPA, DEEPA, NAIVEDYA, APARAADHA KSHAMAAPANA, PRADAKSHINA

పూజ కోసం పూలు సేకరించాలి..
మన కుండీల లోని పూవులైనా
అతి సున్నితంగా వ్యవహరిస్తూ..చెట్టుకు నమస్కరించి...
అమ్మా నీ బిడ్డల్ని నా స్వార్థం కోసం
భగవంతుని సేవ కోసంవేరు చేస్తున్నాను శపించకు తల్లి.. అని క్షమాపణ చెప్పి.. ప్రార్థించి..పూలు కొయ్యాలి..
పుష్ప విలాపం గుర్తుకొచ్చి కళ్ళు చమరించేలా స్పందిస్తూ..బాధగా ఆ పూవులను మన పూజ కార్యక్రమం లో తమ జీవితాలను త్యాగం చేస్తున్నందుకు కృతజ్ఞతలు వ్యక్త పరచాలి....
తమ జన్మ సార్థకత చేసుకుంటున్నందుకు ఒకింత అసూయ కూడా ప్రకటితమావ్వాలి అంటే అతిశయోక్తి కాదు...
అంతగా హృదయం భగవంతుని సేవలో నిమగ్నమవ్వాలి..
ప్రతి అణువులోనూ భగవంతుడున్నాడు అనే సత్యం ,
మన ప్రతి పని ఆయన చూస్తున్నాడు అని నిరంతరం గుర్తుంచుకొని ప్రతి అడుగు వెయ్యాలి..
పాపపు ఆలోచన కలిగిన మరు క్షణం ఒక బరువైన నిట్టూర్పు విడిచి..క్షమాపణ చెప్పాలి..

అటు
పిమ్మట పూజ మందిరం లో ప్రవేశించి పూలతో భగవంతుని శ్రద్ధా భక్తులతో అర్చించాలి..మన పిల్లలకు ఎంత శ్రద్ధ గా అలంకరిస్తామో అలా..భగవంతుడు మన కళ్ళ ఎదురుగా ఉన్నట్లు భావించాలి సంభావించాలి
ప్రభూ నీ పాదాల ఈ కుసుమం ఎంతగా శోభిస్తున్నదో..తండ్రీ..అంటూ..మనసుకు నచ్చినట్లు ప్రేమ పూర్వకంగా సమర్పించాలి..
ఆ తర్వాత..
ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి..
దీపారాధన సమయాన..
హి ప్రభూ..అజ్ఞానులమైన మా చీకటి పోగొట్టి నీ కరుణ అనే వెలుగుతో ఈ దీపారాధన దేదీప్య మానమై మా హృదిలో వెలగాలి స్వామి అని సంభావించి..


నైవేద్య సమర్పణ :
హి ప్రభో !! అండ పిండ బ్రహ్మాండమంతా నిండి , అణువణువునా ఉన్న నీకు కొండంత పత్రిని తేలేను స్వామీ..
నా అశక్తతను మన్నించండి మహాదేవా !!
నా యందు కృపతో, భక్తి తో నీకు సమర్పిస్తున్న ఈ పదార్థాన్ని ( పేరు తో ) స్వీకరించండి స్వామీ !!
నీ ఉచ్చిష్టమైన ఈ ప్రసాదాన్ని నాకు అనుగ్రహించండి తండ్రీ అని మనసారా వేడుకోండి.
(భక్తి ప్రపత్తులతో ఇంట్లో వాళ్ళకీ పొరుగు వారికీ వితరణ చేసి ఎక్కువ భాగం చీమలకు ఆహారంగా ఇవ్వడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది..ఎన్ని జీవుల క్షుదార్తి తీర్చగలిగితే అంతమందికీ అన్న దానం చేసిన దానితో సమానం. నా దృష్టిలో పంచదార చాల మేలు..లేకుంటే పంచదార విడిగా చీమల కోసం మీ మేడ పైన అయినా చల్లి వెళ్ళండి )
=================================================================================================
అటు పిమ్మట మన ఇచ్ఛానుసారం , శక్త్యానుసారం భగవంతుణ్ణి భజించి ( ధ్యానం శ్రేష్టం , నిత్య పూజ అష్టోత్తరమో, సహస్రమో, నామ జపమో )
ఆఖరుగా..
అపరాథ క్షమాపణ :
హి ప్రభో, దయాళా, కరుణాన్తరంగా, కారుణ్య మూర్తీ..
నా శక్తి మేరకు నీ పూజ చేసాను.. ఈ అల్పునకు, అజ్ఞానికీ, శాస్త్ర విహితంగా నిన్ను సేవించే విధానము తెలియదు తండ్రీ..
మరు జన్మలో అయినా విధి విధాన నిను ఆర్చించే శక్తి, ఈ మాయా జగాన ఈ భవ బంధాల నుండి విముక్తి , వైరాగ్య భావన ప్రసాదించండి స్వామీ.. మంత్రం ఉచ్చరించలేని జడుడను , మూఢు డను
నా ఉచ్చారణ లో దోషాలను మన్నించి, మనస్సులో భక్తీ పూర్వకమైన నిర్మల భావనలే స్వీకరించి క్రుతార్థుణ్ణి చేయండి గురు దేవా !! భక్తి, శ్రద్ధ లు లేని ఈ పూజను నీ అపార కృప తో సంపూర్ణం చేయండి గురుదేవా...
నా అశక్తత ను క్షమించమని మనసా, వాచా, కర్మణా తమ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారం చేస్తూ అర్థిస్తున్నాను ప్రభో !
ప్రార్థిస్తున్నాను స్వామీ !!
ఈ క్రమం లో తెలిసీ తెలియక నేను ఒనరించిన అపరాథ , అపచారాలను, దయా సముద్రడవై క్షమించి, నీ దరి చేర్చుకో ప్రభో !!
ఈ సంసార సాగరాన్ని ఈదలేని తుచ్ఛ మత్సాన్ని నేను ..అనర్హతలను పరిగణించక, నీ దరి చేర్చుకో తండ్రీ..
నీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను తల్లీ...
ప్రత్యక్ష దైవాలైన మాతా పితరుల, సోదరీ సోదరుల, భార్యా బిడ్డలా పోషణార్థం నేను ఈ మాయా ప్రపంచాన మనిషిగా అన్ని వేళలా
ప్రవర్తించ లేక పోవచ్చు..అక్రమమో, సక్రమమో ధర్మా ధర్మాలు తెలిసినా , పాపిష్టి సొమ్ము కూడ గట్టి చేస్తున్న నా తప్పులను అన్నిటినీ నిరుపమానమైన నీ తల్లి మనసు తో క్షమించు అమ్మా...
అందరినీ కన్న పేగువు...అపరాథాల గణించక , శిక్షించక , దయతో చూడు నాన్నా
నీ బిడ్డను రక్షించు...కాపాడు...
నాకు నీ చరణారవిందముల యందు శ్రద్ధా , భక్తి ప్రపత్తులు , అందరినీ కని, పెంచి, పోషించే మహా రాజువైన నీ పై, మా పిల్లల పైన, మా కుటుంబం పైన ఎంత ప్రేమ ఉందొ అంతకు మించి రెట్టించిన ప్రేమ, వియోగ బాధ, వైరాగ్యం అన్ని జన్మలలో అనుగ్రహించి మహోపకారం చేయి తండ్రీ... తీర్చుకోలేని ఈ రుణ భారం నుండి నన్ను విముక్తుణ్ణి చేయండి గురుదేవా..
వీటి తొబాటుగా, సద్బుద్ధి, ఎన్నడూ చెడు తలంపులు రాని విధంగా, అన్నిటినీ మించి, అహంభావం తలెత్తకుండా అనుక్షణం కాపాడండి గురుదేవా....కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల నుండి ఈ జీవిని, ఈ దేహిని కాపాడండి గురుదేవా..
ఆఖరుగా, ఈ సంసార సాగరాన్ని తరించలేని నాకు అన్నింటా తోడై నీడై, నన్ను, నా కుటుంబాన్ని సుఖ సంపదలతో మంచి మనుషులుగా జీవించే విధంగా చేయండి ప్రభో..

అని అపరాధం చెప్పుకొని..

( గురుదేవా అని దైవాన్నే గురువుగా సంభావిస్తే ఆయన అనుగ్రహం అపరిమితంగా ఉంటుంది, సరి కదా.. మంచి గురువు ను మనకు ప్రసాదిస్తారు, మనస్సులో సద్భావనా సుమాలు విరబూసేట్లు చేయటం ఆయనకు అరచేతి ఉసిరిక..కనుక స్వామీ, దేవా అనడం కన్నా గురుదేవా అని సంబోధించడం వల్ల సాక్షాత్తు భగవంతుణ్ణే గురువుగా బడయు మహదవకాశం మనకు లభించి శీఘ్రం గా ఆ దేవ దేవుని కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులమై ఈ సంసార సాగరాన్ని తరించి, మన జన్మ చరితార్థం చేసుకుందాము ..)

=============================================================================================
ప్రదక్షిణా నమస్కారం :
ప్రదక్షిణ చేస్తూ.. దేవాది దేవా..
ఏ జన్మలో ఏ మహాపచార ఫలితమో, మహా పాపాల ఫలితమో తండ్రీ , ఈ నిరంతర గర్భావాసం తండ్రీ...
పురాకృత పాప కర్మలతో పాప పంకిలమైన ఈ ఆత్మను బ్రోచి, పాపమే చేయని వివేచనా, సత్కర్మాచరణ చేసే సద్బుద్ధి ప్రసాదించండి ప్రభో..
నీ చరణములు తక్క దిక్కే లేదు , పరమాత్మా.,..అందరినీ కన్న తల్లివే....నీ బిడ్డ అయిన ఈ పాపాత్ముణ్ణి , క్రూరాత్ముణ్ణి, అహంకారినీ, మనసారా క్షమించండి దేవాధి దేవా, ..పరంధామా, పరాత్పరా...పాహి మాం పాహి పాహి !!
రక్షమాం రక్ష రక్ష !!
నీవు తప్ప నాకు ఇంక ఎవ్వరూ లేరు లేరు తండ్రీ... !!!!
తల్లివీ, తండ్రివీ, గురువువూ, దైవానివీ నీవే..
నీ చరణాలే శరణం దేవ దేవా ...సర్వం నీవే సర్వేశా...నా బాధ్యత అంతా నీకే అప్ప చెప్తున్నాను తండ్రీ..
త్రికరణ శుద్ధిగా నీ పాదాలకు సర్వస్య శరణా గతి చేస్తున్నాను గురు దేవా..
దయతో ఈ దీనుని, హీనుని, ప్రార్థించడం రాని ఈ జడుని పలుకుల ఆలించి .. పాలించవా ప్రభూ...
దయా సింధో..దీన బంధో..
దైనందిన జీవితం లో నా ఇంద్రియాలు ఎటువంటి ప్రలోభాలకు గురి అవకుండా, చెడు వైపు దృష్టి వెళ్ళకుండా కాపాడు తండ్రీ..
కళ్ళతో చూసే, చేసే పాపాల నుండీ, అపశబ్దాలు విను శ్రవణాలు చేసే పాపాల నుండి,
అత్యంత ప్రమాద కారి అయిన జిహ్వను అదుపులో ఉంచి, అందరితో మర్యాదగా మాట్లాడుతూ, అహంకారాన్ని దరి చేయనీకుండా, కోపం, విసుగు రానీయకుండా, సహనంతో ఉండే లాగు
అందరినీ రంజింప చేసే విధంగా సంభాషించే నేర్పు, ఓర్పు, ఎవరినీ నొప్పించని సద్బుధ్ఢి, ఇంద్రియాల నిగ్రహించే శక్తి ని ని అనుగ్రహించండి గురుదేవా...!!!
నాకు తెలియకుండా నా మనసులో ఒచ్చే చెడు ఆలోచనలు, నా ప్రమేయం లేకుండానే చలించే చిత్తాన్ని నియంత్రించే శక్తీ కల నీ నామ సంకీర్తన నిరంతరమూ..నా మనస్సులో మారు మ్రోగేలా , నా మనస్సనే చిత్తరువు పై చిరునగవులు చిందించే నీ రూపమే ఎప్పటికీ, ఎన్నటికీ నిలిచి ఉండేలా అనుగ్రహించండి గురు మహారాజ్...
===============================================================
అని సాష్టాంగ దండ ప్రమాణాదులు ఆచరించి..
మిగతా కార్య క్రమాలకు మళ్ళాలి..
ఇక టిఫిన్ చేసేటప్పుడు ..ఏదైనా తినేటప్పుడు...తాగేటప్పుడు....ఆఖరుకు మంచి నీళ్ళైనా సరే..
భూ మాత కు అర్పించి.,..
ఆ పదార్థాన్ని మనకు భుజించడానికి ఇచ్చిన పరమేశ్వరునికి కృతజ్ఞతలు చెప్పుకొని..
ఉదాహరణ కు..::
బాబా..నీ అనుమతి తో ----------------------ఈ పదార్థాన్ని నీ యొక్క ఉచ్చిష్టంగా భావించి ప్రసాదం గా స్వీకరిస్తున్నాను తండ్రీ..అని
బాబాను కళ్ళ ముందు నిలుపుకొని..బాబా తిని కొంత ఎంగిలి మనకు అనుగ్రహించినట్లు భావించి
( ఆ విధంగా అవకాశం లేని మూగ జీవాలకు ఆ ప్రభుని ఉచ్చిష్టంగా మనం భావించిన ఆ ముక్క.కళ్ళకు అద్దుకొని ఏదైనా జీవి తినే విధంగా అక్కడ పరిసరాల్ని దృష్టిలో ఉంచుకొని పెట్టాలి.
అటు పిమ్మట..శ్రీ సాయినాథ చరణార విందార్పణమస్తు అని ఫల సమర్పణ చెయ్యాలి.....ఒకప్పుడు మనమూ ఆ జన్మలు ఎత్తాము ..అని గుర్తుంచుకొని..
ఈ సదవకాశం మనకు ఒచ్చినందుకు మానవ జన్మ ఇచ్చినందుకు మరో మారు కృతజ్ఞతలు చెప్పుకొని..
.అన్నదాతకు, నమస్కరించుకొని
తినే ప్రతి ముద్దకీ మనసా..స్మరించాలి.
కాఫీ టీ లకు ముందుగా భూమాతకు అర్పించి శ్రీ సాయినాథ చరణార విందార్పణమస్తు అనుకుంటే సరిపోతుంది..కావాలనే కొంచెం లఘువుగా మార్చడం జరిగింది.. 
Be first to comment on this Blog Post!
  
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2019 TeluguPeople.com, All Rights Reserved.