ఎన్టీఆర్ జర్కిన్ వేలం
'అదుర్స్' చిత్రంలో ఎన్టీఆర్ ధరించిన జర్నిన్, హ్యాట్ ను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వేలం పెడుతోంది. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బును పేద కళాకారుల సహాయార్థం వినియోగిస్తారు. ఈ విషయాన్ని 'మా' అధ్యక్షుడు మురళీ మోహన్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ వేలానికి సంబంధించిన వివరాలను 'మా' అధికారిక వెబ్ సైట్ 'మాస్టార్ట్స్ డాట్ కామ్'లో పొందుపరచారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకుల నుంచి ఇప్పటికీ ఈ వేలానికి అనూహ్య స్పందన వచ్చిందనీ, అభిమానులు పోటీపడుతున్నారనీ ఆ ప్రకటనలో తెలిపారు. జర్కిన్ ను వేలంపెట్టిన ఆరు గంటల్లోనే 50,000 రూపాయలు పలికిందనీ, హ్యాట్ కోసం కూడా గట్టి పోటీ ఉందనీ పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 28 వరకూ బిడ్ వేయవచ్చు. ఇతర వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. ఎస్.ఎం.ఎస్.ల ద్వారా కూడా బిడ్ లో పాల్గొన వచ్చు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|