'పయనం' కాందహార్ కాదట!
నాగార్జున కథానాయకుడుగా రాధామోహన్ ('ఆకాశమంత' ఫేమ్) దర్శకత్వంలో ప్రారంభమైన కొత్త చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. ఇటీవల కులమనాలిలో తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుని ఈనెల 15 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో మరో షెడ్యూల్ కు రెడీ అవుతోంది. కాందహార్ ఫ్లైట్ హైజాక్ సంఘటన ఆధారంగా ఈ చిత్రం ఉండబోతోందనే ప్రచారానికి తాజాగా దర్శకుడు రాధామోహన్ తెరదించారు.
'ఇదొక థ్రిల్లర్. అయినప్పటికీ కథ మాత్రం కాందహార్ విమానం హైజాక్ సంఘటనకు చెందినది కాదు. నాగార్జున ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్ గా, ప్రకాష్ రాజ్ ప్రభుత్వాధికారిగా నటిస్తున్నారు. హీరోయిన్ గా ఓ కొత్తమ్మాయి ఉంటుంది' అని రాధామోహన్ వివరణ ఇచ్చారు. తమిళ, భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు వెర్షన్ ను దిల్ రాజు నిర్మిస్తుండగా, ప్రకాష్ రాజ్ తమిళ వెర్షన్ కు నిర్మాత. తమిళంలో 'పయనం' పేరుతోనూ, తెలుగులో 'వాంటెడ్' పేరుతోనూ ఈ చిత్రం విడుదలవుతుంది. ఆసక్తికరంగా సాధ్యమైనన్ని తక్కువ రోజుల్లో నిర్మాణం పూర్తచేసి ఇదే సమ్మర్ లో సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లానింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|