అవార్డు ఘనం: విజయనిర్మల
తెలుగు సినీ పరిశ్రమకు ఆద్యుడైన రఘపతి వెంకయ్య అవార్డు తనకు లభించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ నటి, గిన్నెస్ దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల పేర్కొన్నారు. ఈ అవార్డును ఇంవవరకూ పొందిన ప్రముఖులతో పోలిస్తే తాను చిన్న వయస్కురాలినని ఆమె వినమ్రంగా తెలిపారు. తనకు అవార్డు వచ్చిన విషయం తెలిసి అభిమానులు ఎంతో ఆనందంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారనీ, తనను అవార్డును ఎంపిక చేసిన ప్రతి ఒక్కరితీ తన కృతజ్ఞతలనీ అన్నారు. కృష్ణ గారికి పద్మభూషణ్ ఎంత ప్రాముఖ్యమైందో, తనకు కూడా ఈ అవార్డు అంతే ఘనమైనదిగా భావిస్తున్నట్టు ఆమె తెలిపారు.
రఘపతి వెంకయ్య అవార్డు విజయనిర్మలను వరించడం పట్ల కృష్ణ సంతోషం వ్యక్తం చేస్తూ, అవార్డుకు ఎంపిక చేసిన ప్రభుత్వానికి, కమిటీకి తమ ధన్యవాదాలని అన్నారు. ఈ సందర్భంగా కృష్ణ-విజయనిర్మల దంపతులను ఆలిండియా కృష్ణ, మహేష్ ప్రజా సేన అధ్యక్షుడు మహ్మద్ ఖాదర్ ఘోరి, పల్లె జంగయ్యగౌడ్, తదితరులు ఘనంగా సత్కరించారు.
Be first to comment on this News / Article!
|