రవితేజతో ఎల్లో ఫ్లవర్స్ చిత్రం
క్రేజీ స్టార్ రవితేజ కథానాయకుడుగా యువ దర్శకుడు హరీష్ శంకర్ ('షాక్' ఫేమ్) దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈనెల 25న ఈ చిత్రం ప్రారంభమవుతుందని నిర్మాత తెలిపారు.
రవితేజ హీరోగా నిర్మించే ఈ చిత్రం కోసం హరీష్ శంకర్ ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారనీ, భారీ ఎత్తున అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తామనీ ఆయన తెలిపారు. తమ సంస్థ తొలి చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం తమకు మంచి పేరు తెస్తుందని ఆయన అన్నారు. కథ-స్క్రీన్ ప్లే సైతం హరీష్ శంకర్ అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, రామ్ లక్ష్మణ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్ థమన్ ఎస్ సంగీతం అందించున్నారు.
Be first to comment on this News / Article!
|