రొమాంటిక్ హీరోగా గౌతమ్
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. గౌతమ్ 'పల్లకిలో పెళ్లికూతురు' అనే చిత్రం ద్వారా కొద్దికాలం క్రితం హీరోగా పరిచయమయ్యారు. ఆ చిత్రం బాక్సాఫీస్ ను ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొద్ది గ్యాప్ తీసుకున్న గౌతమ్ తిరిగి ఇప్పుడు మరో చిత్రంలో హీరోగా నటించబోతున్నారు. మూవీ మిరాకిల్స్ పతాకంపై మహేశ్వరరావు నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా కల్యాణ్ మంతెన దర్శకుడిగా పరిచయం కానున్నారు.
కాలేజీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు తెలిపారు. చాలా సరదాగా సాగిపోతూ అందర్నీ ఆకట్టుకునే విధంగా గౌతమ్ పాత్ర ఉంటుందన్నారు. అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ, ఏప్రిల్ 1 నుంచి షూటింగ్ మొదలవుతుందనీ, ఇందులో ఆరు పాటలు ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయనీ, మహేష్ శంకర్ ('వెన్నెల' ఫేమ్) సంగీతం అందిస్తున్నారనీ తెలిపారు. కథానాయిక, నటీనటుల ఎంపిక జరుగుతోందనని చెప్పారు.. ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|