|
|
Articles: My Thoughts | నీతి బీరకాయ - Editor
| |
(కొలను వేంకట దుర్గాప్రసాద్)
'చౌకదుకాణం బియ్యం దారి మళ్లింపు'
'ఈ పథకం నిధులు ఆ పథకానికి దారి మళ్లింపు'
'కంప్యూటరు కంపెనీ లాభాలు దారి మళ్లింపు'
'మంత్రి గారొస్తున్నారని రాకపోకల దారి మళ్లింపు'
'ఏవమ్మోయ్! నీ మొగుడు దారి మళ్లుతున్నాడు... కాస్త కనిపెట్టుకుని వుండు'
ముగింపుకు వస్తున్న ఈ సర్వధారి నామ సంవత్సరంలో - సర్వం దారిమళ్లింపు (బైపాస్) అనిపిస్తోంది కదా? అది తప్పు! పై విషయాలకీ ఈ సర్వధారి నామ సంవత్సరానికీ ఏవీ సంబంధం లేదు. ఎంచేతనంటే అలాంటి విషయాలు ఇప్పటివా? దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి వాటిని ఈ నామ సంవత్సరానికి ఆపాదించడం అపచారం.
సర్వధారి నామసంవత్సరం అంటే అర్థం ఏమిటో తెలీదుగానీ, ఉన్నవాడు అన్నీ ధరిస్తాడు, లేనివాడు అన్నీ భరిస్తాడు - అని తమాషాగా అనుకోవాలి.
అవినీతిని ఈ సంవత్సరంలోనే కొత్తగా కనిపెట్టినట్టు చాలామంది అంటున్నారు. అది దశ, శతాబ్దాలుగా కాదు, యుగాలుగా వస్తున్నది. ఇంత అవినీతిని ఎప్పుడూ మేం చూళ్లేదు అని కళ్ళు తిరిగిపోయినట్టు నటిస్తున్నారు. ఒకయాన అవినీతిమయ ద్రోహుల్ని సముద్రంలో పారేయండి అంటాడు. పదుల సంఖ్యలో వుండే నీతిపరులు లక్షల్లో కోట్లల్లో వుండే అవినీతి పరుల్ని మోసుకెళ్లి సముద్రంలో పారేయడం ఎంత కష్టం! ఒకవేళ అట్టాంటి అద్భుతం జరిగిందే అనుకుందాం - అప్పుడు సముద్రం అవినీతి కంపు గొడుతుంది. భూమ్మీద వున్న కొద్దిపాటి జనం మీద వర్షం కురిసి వాళ్లు కూడా తడిసి అవినీతి ముద్దలవుతారు. చివరికి అవినీతి నూరు శాతం అవుతుంది.
మరొకాయన దోపిడీదార్లను తరిమికొట్టండి అంటాడు. మళ్లీ అదే సమస్య. చిన్న నీతిపరుల సంఖ్య, అవినీతి పరుల పెద్ద పటాలాన్ని ఎట్లాగ, ఎక్కడికని తరిమికొట్టగలదు?
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|