TeluguPeople
  are the trend-setters

 
Articles: Short Stories
దొరబాబు దూరదర్శిని
- Site Administrator
  Page: 1 of 3   Next > >  
వెర్రి వేయి విధానాలని అంటారు. అలాంటి నానుడి మా దొరబాబు లాంటి వాళ్లను చూసే పుట్టి వుంటుందన్న దానిలో అనుమానం లేదు. కొందరికి తిండి పిచ్చి, కొందరికి తాగుడు పిచ్చి.ఇలాఎన్నో రకాల మనుషులను చూశాను కాని దొరబాబుకున్న వింత అలవాటున్న వాళ్ళని మాత్రం ఎక్కడాచూడలేదు. అలా అని మా వాడికి ఏదో దురలవాటుందనుకునేరు. వాడి కున్నది అబ్జర్వేషన్ పిచ్చి. అంటే అన్నింటినీ కూలంకుషంగా పరిశీలించి వాటి గురించి తెలుసుకుని తరించే అలవాటనికాదు. అతనికున్న పిచ్చి రకరాకల దినాలను పాటించడం. అంటే మదర్స్ డే, ఫాదర్స్ డే, వేలంటైన్స్ డే లాంటి చాలా మంది పాటించే లేదా జరుపుకునే పాపులర్ రోజులతో పాటు ఎక్కడెక్కడినుంచో తెలుసుకుని రకరాకల దినోత్సవాలూ, వారోత్సవాలూ, మాసోత్సవాలూ చేస్తుంటాడు.

అయితే తమాషా అయిన విషయమేమిటంటే, అతను చేసే ఈ కాల మాసోత్సవాల్లో ఒక లాజిక్కంటూ కనపడి చావదు. ఉదాహరణకి, జనవరి హాట్ టీ మంత్ మరియు ఓట్ మీల్ అని ఆ నెల పొడుగునా వాటిని త్రాగుతూ, తింటూ, వాటి ప్రాశస్త్యాన్ని అందరికీ వివరించడమే కాక ఆఫీసులో ఉన్న వాళ్ళకి మసాలా టీ, ఓట్ మీల్ కుకీస్ లాంటివి పంచి పెడుతూ గడిపిన మనిషి. మార్చి నాల్గవ వారం వచ్చేసరికి అమెరికన్ చాకొలెట్ వీక్ అని చెప్పి పొలో మని చాక్లెట్లు తింటాడు.

జూన్ లో తాజా పండ్లూ, కూరగాయలు తినాలన్న మనిషి. జూలై అంతా ఐస్ క్రీం మాసోత్సవం చేస్తాడు. ఇక అక్టోబర్ లో అయితే మరీ విడ్డూరం. అది వెజిటేరియన్ అవేర్నెస్ మంతే కాక సీ ఫుడ్ మంత్ కూడా నట. దాంతో ఒక పూట ఇదీ, ఒకపూట అదీ తింటూంటాడు.

ఈ మధ్యే జరిగిన ఓ తమాషా సంఘటన గురించి కూడా చెప్పాలిప్పుడు, ఫిబ్రవరి నేషనల్ వైల్డ్ బర్డ్ ఫీడింగ్ మంత్ అట. తెలుగులో చెప్పాలంటే అడవి పిట్టలను మేపే నెలన్నమాట. దాంతో మనవాడు పొట్లాట కొద్దీ గింజలేవో కొని 'అడవికి పోదాం, పక్షులు చూద్దాం చలో చలో, మేతము పెడదాం చలో చలో, పొద్దు పొడిచే ముందుగా నీ ముంగిట వాల్తానోయ్' అంటూ ఓ వారంతపు ప్రాత: కాలాన్నే మా ఇంటికొచ్చి, దగ్గరలో ఉన్న ఓ నేషనల్ ఫారెస్టుకి నన్నూ లాక్కెళ్ళాడు. అక్కడో చోట చేరి దొరబాబు గింజలను విసురుతోంటే నేను అతనికీ, మేత మేయటానికి వచ్చిన పక్షులకూ ఫోటోలు తీస్తూ ఉన్నాను. కొంత సేపటికి రకరకాల పక్షులు చాలా వచ్చిచేరాయి. అంత పెద్ద గుంపూ అక్కడ చేరినా ఇంకా తాపీగా ఒక గింజో, అర గింజో విసురుతూ, ఫోటోలకు ఫోజులిస్తూ కూర్చునేసరికి అసహనానికీ, ఆకలకీ లోనైన కొన్ని పక్షి రాజములు దొరబాబు నెత్తినా, చేతినా టకూ టకూ మని పొడిచి గింజల పొట్లాన్ని కాస్తా తన్నుకు పోయాయి. అవి పొడుస్తున్నప్పటికంటే వాటి తాకిడికి దొరబాబు తత్తరపాటుతో వేసిన కుప్పిగంతులు, పిల్లి మొగ్గలూ చూసి నాకింక నవ్వాగింది కాదు. పగలబడి నవ్వుతున్న నన్ను చూసి, 'ఎందుకయ్యా అలా కుమిలి కుమిలి నవ్వుతావు. దానిలో అంత నవ్వటానికేముందీ' అని మరింత ఉడక్కున్నాడు.


Read 2 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 3   Next > >  



 
Advertisements
Advertisements
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Regional News
Hyderabad
Visakhapatnam
Vijayawada
Tirupati
Kurnool
Rajahmundry
Warangal
Anantapur
Eluru
Guntur
Kadapa
Kakinada
Karimnagar
Nellore
Nizamabad
Blogs
My Blogs
Popular
Active Blogs
Recently Created
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals
Discussion
Poetry
Govt and Politics
Offbeat and Jokes
Networking
My Friends
New Members
Invite a Friend
Galleries
My Photos
News
Cinema
Fashion
Sports
Travel
Videos
Top in Views
Top by Rank

(C) 2000-2013 TP Media India Ltd., All rights reserved.