|
|
Articles: Devotion | సాయి లీలలు - Mr. Syam Satyanarayana Konduri
| |
తద్విగ్నార్ధం సద్గురు మేవ అభిగచ్చేతి - సమిత్యాని శ్రోత్రియం
బ్రహ్మనిస్తం అచర్యవాన్ పురుషొ వేదహ.
చూడie అందరి గమ్య స్థానాలూ ఒకటే కాని సద్గురు సాయిబాబా అనుగ్రహం కలవారికి అదృష్టం తనకి తానై వరించి ఉద్ధరిస్తుంది అన్న మాటలో సందేహం లేదు. బాబా అనుగ్రహం ప్రభవించి తరించిన వారిలో కీర్తిశేషులు సూరి విజయ రామయ్య ఒకరు.
ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషహ
అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం!
భగవద్గీతలో ఆత్మసంయమ యోగంలో శ్రీ కృష్ణుడు ఒకటో శ్లోకంలో కర్మ ఫలాన్ని ఆశ్రయించకుండా కర్తవ్య కర్మలను ఆచరించేవాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి . కాని కేవలం అన్ని కార్యాలను త్యజించినంత మాత్రాన సన్యాసీ కాడు యోగి కూడా కాడు. అలాగే కేవలం క్రియలను త్యజించినంత మాత్రాన యోగి కాడు అని చెప్పాడు.
దీనికి ముందు చెప్పిన శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్పిన రీతిగా సంసారబంధంలో ఉండి ప్రయత్నపూర్వకంగా యోగసాధన చేసే యోగి అనేక జన్మల సంస్కారాల ప్రభావంతో ఈ జన్మలోనే సిద్ధి పొంది సంపూర్ణంగా పాపరహితుడై తక్షణమే పరమపదాన్ని పొందుతాడు.
భగవద్గీతలో చెప్పిన విధంగా తన జీవితాన్ని సాఫల్యం చేసుకున్న యోగి కాని యోగి బాబా అనుగ్రహపాత్రుడయిన సూరి విజయ రామయ్య అనటంలో సందేహం లేదు. వీరు 1917 ఆగస్టు 2న ఒక శ్రోత్రియ కుటుంబంలో జన్మించారు. వీరి మాతామహులు సూరి శ్రీరాములు, సూరి లక్ష్మమ్మ. వీరి ఐదుగురు సంతానంలో రామయ్య నాలుగోవారు. వీరు ఏకసంథాగ్రాహి. చిన్న ప్రాయంలోనే భాగవత రామయణ గ్రంధాలను వ్యాకరణ తదితర గ్రంధాలను సంస్కృత, ఆంగ్ల భాషలలోను విశేష పాండిత్యం గడించిన ఉద్దండులు. వీరి జ్ఞాపకశక్తి అమోఘం. వీరి క్రమశిక్షణాయుతమైన జీవన విధానం అద్భుతం. వీరు 1939 - 1945 మధ్య కాలంలో బ్రిటిష్ సైనిక దళంలోనూ, రెండవ ప్రపంచయుధ్ధంలోనూ పనిచేశారు.
ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ఆయన జీవన విధానంలో ఏ విధమైన మార్పులు లేవని వారి తోటి వారు అంటూ ఉంటారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|