|
|
Articles: My Thoughts | చనిపోయిన తరువాత - Mrs. sujatha Thimmana
| |
చనిపోయిన తరువాత మనం ఏమవుతామో ఎవరికీ తెలియదు. ఈ విషయం మీద ఏది మాటాడుకున్నా అన్నీ మనం చేసుకునే ఊహాగానాలు మాత్రమే...
ప్రపంచం మొత్తం మీద ఈ విషయం తెలుసుకోవాలని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు మహానుభావులు. కానీ నిజం ఏమిటో తేల్చలేకపోతున్నారు.
ఆత్మ అంటే ఏమిటి..? అనే ప్రశ్న...ప్రశ్నగానే ఉంది. చనిపోయిన పది రోజులు ఆత్మ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనుకుంటాము. నిజానికి మనతో కలిసి ఉండి ఆకస్మికంగా దూరం అవుతారు కాబట్టి వారి జ్ఞాపకాలను కాస్త నెమరువేసుకుని మెల్లగా మరచిపోవటానికి చేసే ప్రయత్నమే అనిపిస్తుంది. అయినవాళ్ళు, బంధువులు అందరూ ఒకచోట కలుసుకొని వారి గురించి తలచుకుంటారు. తరువాత అంతా మామూలైపోతుంది. ఆ చనిపోయిన వ్యక్తి మాత్రం మనకిక కనిపించరు... జీవంతో ఉన్నప్పుడు వారిని ఎన్నో ఇక్కట్లకు గురిచేసిన వాళ్ళే వారు పోయిన తరువాత వారికి కర్మ అని వేడుక చేస్తారు.
చనిపోయిన వారి ఆత్మ శాంతి ముఖ్యమా...?
బ్రతికి ఉన్నప్పుడు వారికిచ్హే మనశ్శాంతి ముఖ్యమా...?
| Read 6 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|