|
|
Articles: Devotion | ప్రార్థన - Mr. venkataramayya putrevu
| |
1. పావనంబౌగాదె నా జీవనంబు నీ దివ్య పదపద్మ సేవనందె
యంచు మదినెంచి కొల్తు నిన్నె అనన్య భక్తియుక్తులన్, యో!
జగతీధవా! జగన్నాథా! నా జేసిన తప్పులన్న్సైచి, నీ
పాదాబ్జముల్జేర్చి కరుణింపవే కమలనాభా! కమలాపతీ!!
2. దశరథనందన దాశరథీ! జనకజాహౄదయేశా!జగదీశా!
పద్మదళాయతలోచనా! రఘువంశ విభూషణా! రఘురామా!
మునిజన హృదయ విహారా! మారుతిసేవిత పవిత్ర పదాబ్జా!
దీనదయాళో! దేహి మే తవ పాదాంబుజసేవనం సదా!!
3. అభయప్రదాయకా ఆనందదాయకా! మంగా మనోనాయకా!
ప్రస్తుతి జేసి కొల్తు నిన్నె పరమపురుషా! పరంధామా!
కర్పూర నీరాజనములివె నీకయ్యా కమలాక్షా! కమలాపతీ!
కైదండనొసగి కరుణ గావవయ్యా కరుణాపారీణా!
4. నారాయణ వాసుదేవా లక్ష్మీహృన్నివాసా లక్ష్మీశా
దేవదేవ జగత్పతే భక్తానురక్త పరిపాలన పారిజాతా
నారదాది యోగీంద్ర సంస్తుత్య నారాయణా,ముకుందా మాధవా
నమస్సులివె నీకయ్యా నిత్యలక్ష్మీ విహారా నారాయణా!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|