|
|
Articles: Recipes | ఆలూ జంతికలు - Site Administrator
| |
(హాసిని కె)
కావలసిన పదార్థాలు :
బియ్యంపిండి - పావు కేజీ
బంగాళదుంప తురుము - అర కప్పు
నెయ్యి - రెండు టీస్పూన్స్
పసుపు - కొంచెం
వాము - ఒక టీస్పూన్
ఉప్పు - తగినంత
కారం - ఒక టీస్పూన్
నూనె - వేయించేందుకు సరిపడా
తయారుచేయు విధానం :
జల్లించుకున్న బియ్యంపిండి లో వాము, ఉప్పు, కారం, పసుపు, బంగాళాదుంప తురుము వేసి నీరు కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు నానబెట్టాలి. తరువాత జంతికలు చేసే చట్రంలో పిండిని కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి. దీన్ని నూనె కాగిన తర్వాత జంతికల్లాగా వత్తుకోవాలి. ఎర్రగా కాలిన తరువాత వీటిని తీసేయాలి. అంతే ఆలూ జంతికలు సిద్ధమైనట్లే. ఇందులో బంగాళాదుంపను కలపడంవల్ల జంతికలు వెరైటీ రుచితో కమ్మగా ఉంటాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|