|
|
Articles: Devotion | వినాయకా - Mrs. sujatha Thimmana
| |
విఘ్నాలు తొలగించు వినాయకా
మా విన్నపము వినవయ్య
మారాము చేయక...
వినాయకా...
గణనాయకా...
వాదాలకు తల వొగ్గి
వందనము ఒకటి చేసి
వేదాలు చేతబట్టినావు
వరాల పుత్రుడవు
తల్లి పార్వతీ నందనుడవు //విఘ్నాలు//
తొలి పూజలందుకొంటూ
మలిగాపు వరకూ...
కాపు గాస్తుంటావు
మరుగుజ్జు రూపమయిన
బహు సుందరాగుడవు నీవు //విఘ్నాలు//
మారేడు, నేరేడు,
ఉమ్మెత్త పత్రి తోటి
వేదిక వేసినాము
వేంచేయుమయ్యా నిన్ను
విరజాజి పూలతోటి
అర్చింతుమయ్యా...
ఉండ్రాళ్ళు, గుగ్గిళ్ళతో పాటు
మా ఆత్మల నివేదన చేసి
నిను పూజింతుమయ్యా.... //విఘ్నాలు//
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|