|
|
Articles: Recipes | కోవా పూరి - Site Administrator
| |
(దివ్య)
కావల్సిన పదార్థాలు
పాలు : 1 లీటరు
గోధుమ పిండి : 1/2 కిలో
పంచదార : 1/4 కిలో
నెయ్యి : 350 గ్రాములు
జీడిపప్పులు : 10
బాదం పప్పులు : 10
కిస్ మిస్ : 10
యాలకులు : 5
తయారు చేయు విధానం
బాదం పప్పులను నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండిని జల్లించాలి. ఆ పిండిని ఒక పాత్రలోకి తీసుకొని దానిలో నెయ్యి కాచి పోసుకుంటూ పూరీలముద్దలా కలుపుకోవాలి. పాలను మందపాటి గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాలి. ఒక గరిటతో ఈ పాలను కలుపుతూ ఉండాలి. బాగా మరగిన తర్వాత ఈ పాలు పేస్ట్ మాదిరిగా చిక్కగా కోవా తయారవుతుంది. నానబెట్టిన బాదం పప్పుల పై పొట్టు వొలుచుకోవాలి. జీడిపప్పు, బాదంపప్పులను మెత్తగా మిక్సీ వేసుకోవాలి. దీనికి యాలుకులు, కిస్ మిస్ ను జతచేసి కోవాలో కొంచెం నీళ్ళతో ముద్ద అయ్యేలా కలుపుకోవాలి. నేతితో కలిపిన గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా వత్తుకోవాలి. దానిలో ఒక స్పూన్ కోవామిశ్రమాన్ని పెట్టి మరలా మరో పూరీనీ దానిపై పెట్టి రెండు పూరీలనూ చుట్టూ వేళ్ళతో నొక్కి పెట్టి మధ్యకు మెలి తిప్పుకోవాలి. ఇలా అన్నీ తయారుచేసుకున్నాక స్టవ్ మీద బాణలీ పెట్టి నెయ్యి (లేదా) నూనె వేసి కాగాక తయారు చేసుకున్న పూరీలను అందులో వేసి దోరగా వేగనివ్వాలి. మరో పొయ్యిమీద గిన్నె పెట్టి అందులో పంచదారలో కొద్దిగా నీళ్ళు పోసి ముదురు పాకాన్ని రానివ్వాలి. ఈ పాకంలో వేగిన పూరీలను పాకంలో వేసి వెంటనే తీసి పళ్ళెంలో ఆరబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|