|
|
Articles: Recipes | గులాబీ పూలు - Site Administrator
| |
కావలసిన పదార్థాలు :
శనగపిండి - అరకిలో
బియ్యం పిండి - 100 గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడ
కారం - తగినంత
తయారు చేయు విధానం : శనగపిండి, బియ్యం పిండిలో ఉప్పు, కారం వేసి కాగబెట్టిన నూనె కొద్దిగా వేసి కలపాలి. తర్వాత నీళ్ళతో బజ్జీల పిండికన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. నూనె బాగా కాగిన తర్వాత గులాబీ పువ్వు గుత్తి (ఇది స్టీల్ సామాన్లు అమ్మే కొట్లో దొరుకుతుంది) ని నూనెలో సగం మునిగే వరకు ఒక్క సెకను అలా పెట్టి తీయాలి. దీన్ని శనగపిండిలో గులాబీ గుత్తి సగం మునిగే వరకు ఉంచి కాగిన నూనెలో వేయాలి. అందులోకి గులాబీ పువ్వు మాదిరిగా ఉండే అచ్చు నూనెలో పడుతుంది. దీన్ని మురుకులు వేయించుకున్నట్టు వేగనివ్వాలి. చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే మెత్త బడకుండా ఉంటాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|