|
|
Articles: Devotion | దేవీస్తుతులు - Mr. venkataramayya putrevu
| |
ఆద్యంతరహితయైన ఆదిశక్తి, దయాకారుణ్య
నిధానయైన మాతృమూర్తి, అఘంబులుబాపి
శుభంబులనిచ్చు, కరుణామయీ, విశ్వేశ్వర
వామాంకస్థిత ధరణీధరేంద్రనందినీ ఆ
జగజ్జనని మత్కృతాపరాధముల్సైచి బ్రోచుగాతా!!
అమ్మా జగదంబా! శ్రీశైలేశు హృదయవిహారిణీ!
అభయప్రదాయినీ ఆనందదాయినీ!నీ శ్రీచరణములే
శరణమోయమ్మా దేవీ భ్రమరాంబా!
మాహేశ్వరీ, కామేశ్వరీ!కాశీవిశాలాక్షీ,అన్నీ
నీవెగదమ్మా!దేవీ! భ్రమరాంబా! నీ చల్లని
చూపులే సతకోటి సంపదలు మాకు, నీ దర్శనా
కాంక్షులమై నీగుడిముంగిటన్ నిల్చియున్నామమ్మా
కరుణను బ్రోచే తల్లివి నీవెగదమ్మా
దేవీ భ్రమరాంబా! ఈవమ్మా దర్శనమ్ము
చేయుమోయమ్మ మాజన్మ సఫలమ్ము!!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|