|
|
Articles: Poetry | మరో ప్రపంచం - Mr. ramu vidyarthi veluri
| |
మస్తిష్కంలో పరిగెట్టే
ఆలోచనల రైళ్లకు
'బ్రేక్స్' పడినప్పుడు
మనోనేత్రాలకు అడ్డంగా నిలిచిన
అహంకారపు తెరలు తొలిగిపోయినప్పుడు
అప్పుడు
దిగంతాల దాకా లేస్తుందొక కళాస్థలి
మనలో కలుగుతుందొక మహత్తరానుభూతి
అప్పుడు గడ్డిపరక నుండి గగన కుసుమం దాకా
ఓకే మాత్రలో తాకగలం
అప్పుడు
దూరంగా కనిపించే
ఆ గిరుల ఆకృతే వేరు
సెలయేళ్ళ పరుగుల తీరే వేరు
తరు భంగిమలే వేరు
పూల రంగులే వేరు
పక్షుల ఎగరికలే వేరు
చిమ్మటాల పాటలే వేరు
తుషారంలో విచ్చే
ఆ ఇంద్రధనసులే వేరు
ఇంతెందుకూ
మురికి కాలవల రూపం సైతం వేరే
చూపు కదిలితే చాలు
అందం చిందుతుంది
ఆనందం పొంగుతుంది
అప్పుడు నువ్వు లేవు
నేను లేను
ఉన్నదంతా ఆ మహత్తరానుభూతే!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|