|
|
Articles: Devotion | కైలాసవాసా - Mr. venkataramayya putrevu
| |
సుధాసముద్రోద్భవ హాలాహలమున్ కంఠంబునన్నిల్పి
శ్రీకంఠుడవైనావు, ఆ సురగంగనే నీ జటాజూటంబునన్
నిల్పి గంగాధరుండవైనావు, జగదేకజననియైన ఆ
అంబనే అర్ధభాగంబునన్నిల్పి సాముడవైనావు,
ఇట్లెన్నెన్నో నామబులన్, మరెన్నో రూపంబులన్ మానవాళిన్
సదాబ్రోచుచున్నట్టి ఈశ్వరా విశ్వేశ్వరేశ్వరా
నమస్సులివే నీకయ్యా నీలకంధరా కరుణతో మమ్మేలు
కారుణ్యాంతరంగా! కైలాసవాసా! శివా!
నిన్నేరీతిన్ నుతింపగాగలను ఏరీతిన్ సేవింపగా గలను
నీ మాహాత్యంబింతింతని నుడువగా శక్యంబె ఎవ్వారికిన్
శైలరాజతనయా హృదయేశా! ఈశా! నీ దివ్యరూపంబె
మదినెంచి గొల్తునంటె తుదిమొదల్ గానగాలేనట్టి ఆ
విశ్వరూపంబు బ్రహ్మాదులకే వీక్షింప అలవిగాదాయె
మానవ నయనాచల గోచరుండవై మా పూజలందుకొని
మమ్మెలుమో పార్వతీ హృదయేశా! ఈసా! జగన్నివాసా!!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|