|
|
Articles: Poetry | కరువొచ్చింది - Dr. Raghotham Reddy Pinninti
| |
మంచి మనుషుల కరువొచ్చి... చాలా ఏళ్లైంది
తప్పు ఎవరు చేసినా.. ఒక్కటే అని
సూటిగా చెప్పలేని.. ఒప్పుకోలేని
పెద్దల కరువొచ్చింది
మట్టి కోసం
ఇచ్చిన మాట కోసం
నమ్మిన బాట కోసం
తనువునైనా.. వదులుకునే
మహానుభావుల.. కరువొచ్చింది
కాల్చేవాళ్ళు... మనోళ్ళే
కాల్చబడ్డది... మనోళ్ళే
కాల్చబడుతున్నది.. మనదే
మారణహోమాన్ని.. ఆపగలిగే..
ధీరుల కరువొచ్చింది
పేదవాడి.. బాగు కోసం
పుట్టుకొచ్చిన.. పోరాటం
అందరికీ.. సమానమని..
రాసుకున్న రాజ్యాంగం
చేతులెత్తేసి.. చాలా ఏళ్లయింది..
సమాజమయినా.. ఉద్యమమయినా.. చక్కగా నడుపగల
నాయకుల కరువొచ్చింది
తప్పు నీదంటే.. నీదని.. తప్పిచుకోవడం
మాటల గమ్మత్తుతో.. మనసులను.. గుంపులో.. కలుపుకోవడం
గుంపు పేరు ఏది అయినా..
కింద ఉన్నోళ్లే.. పైకి పోవడం
పైన ఉన్నోళ్ళంతా.. ఉన్నోళ్ళవ్వడం..
ఆస్తుల కంటే.. ఆత్మాభిమానం.. ముఖ్యమనే
నిజం నేర్పించే.. మానధనుల.. కరువొచ్చింది
చూస్తూ కూర్చుంటే.. తలరాతలు మారవు
నిజాన్ని.. నువ్వు చూడకుంటే
చీకటి నిన్ను మింగేస్తుంది
నిజాయితీగా.. నిలదీయడం.. ఎలాగో..
నేర్పించే.. నిజాయితీ గల మనుషుల కరువొచ్చింది
నిన్ను తొక్కుకుంటూ పైకి వెళ్ళేవాడు
నీ కులపోడు ఎలా అవుతాడు
నీ బాగు చూడలేని వాడు
నీ మతమోడు ఎలా అవుతాడు
కులం మతం కంటే..
మంచి మనుషులవ్వడం
అత్యవసరం అని
అర్థం చేయించగల..
మహాత్ముల కరువొచ్చింది
ఆవేశంతో.. ఎక్కడికో వెళితే
నీ తలరాత మారిపోదు
ఆలోచించడం మరిచిపోతే..
నిజం నీకెప్పుడూ తెలియదు
ఎదురుగ వచ్చే.. ప్రమాదాన్ని.. ఎదిరించడం ఎలాగో
నేర్పించే.. మంచి అమ్మ నాన్నల కరువొచ్చింది
నీ బాధ్యతని.. నీ హక్కుని..
సమానంగా.. చూడడం నేర్చుకో
తప్పించుకుపోవడాన్ని.. మరిచిపో
మంచి మనసుల.. కరువుని.. తీర్చుకో
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|