పాపం దేవుడు!
కోట్లాది వత్సరాలు శ్రమించి
మనిషిని సృష్టించాడు
మనిషి ద్వారా తన
మనసును ఆవిష్కరిద్దామని
కాని మనిషేం చేశాడు?
ఏకంగా తానే దేవుళ్ళని సృష్టించి
తన మనసు రంగుని దేవుళ్ళకి పూసి
ప్రపంచం మీదికి వదిలాడు
ఇక చూసుకో
అప్పటి నుండి మనిషిదే
ఈ లోకం మీద పెత్తనం!