|
|
Articles: Poetry | నానీలు - 53 - Miss kumari kumari
| |
విత్తనం - మట్టి
దాగుడు మూతలు
ఆడుతుంటే..
పరవశించె పచ్చదనం..
హక్కు - బాధ్యతకై
వగచే 'ఓటర్'..
'ఓటు' విషయంలో మాత్రం
దొరకని దొంగ..
గంతలు కట్టి మరీ
'అన్యాయం'
జోరు పెంచుకుంటుంది..
'గిన్నిస్ బుక్'లో చోటు కోసం..
బ్రతకటానికి
ప్రయత్నం చేస్తుంటే..
'రాళ్ళ' వర్షంలా
జ్ణ్జాపకాల కన్నీళ్ళు..
పోరాటంలో
పోటీ పడిన 'రాయి'..
మౌనంగా రోదిస్తుంది
'సమాధి'గా మారి..
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|