|
|
Articles: TP Features | మన భాషను ప్రేమిద్దాం - Site Administrator
| |
(డాక్టర్ సామల రమేష్ బాబు)
మనసు కలిగి, మెదడు కలిగి, మాట కలపగలవాడు మనిషి. ఈ మనిషి ఇన్ని వేలాది సంవత్సరాల నుండీ తనదైన మాటల్ని నిర్మాణం చేసుకొంటూనే ఉన్నాడు. అందుకోసం అతడి నోటి వెంట వచ్చే శబ్దాల రూపం, భాష, ఆయా మానవ సమూహాలు తమదైన భాషల్ని రూపొందించుకొంటూనే ఉన్నాయి. ఈ విశాల ప్రపంచంలో ఎన్నో వేల భాషలు ఇలాగే రూపుదాల్చాయి. మనిషి తన తల్లితండ్రుల్ని ప్రేమించినట్లే, తన సంతానాన్ని ప్రేమించినట్లే తన భాషను కూడా ప్రేమిస్తాడు. అందుకే తన భావాల్ని చెప్పుకోవడానికి తాను ఉపయోగించ గల భాషను ఎదుటివారు ఎగతాళి చేస్తే సహించలేడు. వైవిధ్యం మానవుల స్వభావం.
మానవ సమూహాలు విస్తరించే కొలదీ, వారి మధ్య సంబంధాలు పెరిగే కొద్దీ వారి భాషలు కూడా పరస్పరం ప్రభావితమవుతాయి. ఒకే భాష మాట్లాడేవారిలో కూడా ప్రాంతాలవారీగా ఉండే మాండలిక వైవిధ్యాన్ని, యాసల్ని గౌరవించి తీరాలి. ఎంతో సాంకేతిక ప్రగతినీ, నాగరికతనూ సాధించామనుకొంటూ ఇంతటి సహజమైన, మానవీయ అంశాలను కూడా తెలుసుకోకపోతే మనం మనుష్యలమెట్లా అవుతాం? ఒక పెద్ద భాషగా, అనేక చారిత్రక పరిణామాల ఫలితాలను అనుభవించిన జాతిగా మన 'తెలుగు' భాషా సంస్కృతులెంతో వైవిధ్యాన్ని సంతరించుకొన్నాయి. మనం భాషా ప్రేమికులమనుకొనే ముందు మన మాటలో, పాటలో, ఆటలో, బ్రతుకుల్లో ఉండే వైవిధ్యాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. అలా కాకుండా, తెలుగుభాష తీయనిదని, కమ్మనిదని అంటూనే - దాన్ని తమ రసాంకురాల్లో, రక్తకణాల్లో నింపుకొన్న ప్రజాస్వామ్యాన్ని ఏవగించుకోవడం భాషను ప్రేమించడం ఎలా అవుతుంది? అవసరాలను బట్టి మాటల్ని పుట్టించగల అసలు జనంపై పలు విధాలుగా పరభాషలను నెత్తినరుద్దిన, రుద్దుతున్న మన అవివేకాన్ని మనం తెలుసుకొనేదెప్పుడు?
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|