|
|
Articles: Poetry | విషం - Dr. Raghotham Reddy Pinninti
| |
పిల్లల్ని విషం తినిపిస్తూ పెంచుకుంటే
కాటువేయక... ఆత్మీయంగా... ఎలా ఉండగలరు
లంచం అనే విషం తినడం... ఆపకపోతే
రాక్షసులుగా తప్ప మనుశులుగా ఎలా ఉండగలరు
ఎవరికో చెందవలసిన దాన్ని
లంచంగా నువు లాక్కుంటూ పోతే
గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి
ఏదో ఓ శుభ గడియలో
నీ గుండెలో చిక్కుకుపోకా పోదు
నీ చావుని... పండగలా... ఊరు ఊరంతా.. జరపకా... మానరు...
రెండు చేతులనూ బార్లా చాచి
బకాసురుడికి.. అన్నలా
కొల్లగొట్టిన అమాయకుల.. బ్రతుకుల.. చితులలో౦చి
ప్రకృతిలో కలిసిపోయిన ఆక్ర౦దనలు
నేలగానో
నీరుగానో
గాలిగానో
చుట్టుముట్టి.. తుదముట్టించక మానవు
నడుస్తుంది.. కదా అని
కనుచూపుమేర.. నీ కొరకే కూడబెట్టుకున్నా
పోయే రోజొస్తే...
బంగారపు గదిలో దాక్కున్నా
వజ్రల్లాంటి మందులేసుకున్నా
చావును నువు ఆపలేవు
పరిమితులు లేని ఏ పని అయినా
పతనం వరకు వెళుతుంది
నువు... మరణిస్తే తప్ప...
మంచి జరగదని... అనుకునేలా...
నువ్వు బ్రతకాలనుకున్నపుడు
చట్టాన్ని న్యాయాన్ని లంచం డబ్బుల్లో చుట్టేసినప్పుడు
గుండె కండ గల యువకులందరు మనకెందుకు అనుకున్నప్పుడు
నీ చావు కోసం ఎదురు చూడటం తప్ప...
అభాగ్యులు చేయగలిగేది.. ఏముంది?
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|