|
|
Articles: Recipes | వెజిటబుల్ జైపురి - Site Administrator
| |
కావలసిన పదార్థాలు
బీన్స్ - పావుకిలో
క్యారెట్స్ - 2 మీడియం సైజ్
కాలీఫ్లవర్ - చిన్న పూవు
టమోటాలు - 3
పన్నీర్ - 100 గ్రాములు
ఉల్లిపాయలు - 2
జీడిపప్పు - 30 గ్రాములు
గసగసాలు - 20 గ్రాములు
పెరుగు - 1 కప్పు
కొత్తిమీర - 1 కట్ట
అల్లం, వెల్లిలి పేస్ట్ - 1 టీ స్పూన్
నూనె - 4 టీ స్పూన్స్
ఉప్పు - రుచికి సరిపడ
కారం 1 టీ స్పూన్
పసుపు - అర టీ స్పూన్
తయారు చేయువిధానం : క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పది నిమిషాలు ఉడకపెట్టి నీటిని వార్చుకోవాలి. గసగసాలను, జీడిపప్పును మిక్సీ వేసుకోవాలి. తరువాత స్టవ్ మీద బాణలి పెట్టి తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి ఫేస్ట్, జీడిపప్పు మిక్స్ ను వేసి అయిదు నిమిషాలు వేయించాలి. దీనిలో ఉడికించిన కాయగూరల ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత పెరుగు, టమాటాలు ఉప్పు, కారం, పసుపు వేసి చిక్కబడేవరకూ ఉడికించు కోవాలి. పన్నీర్ ను తురిమి ఈ కూరలో కలిపి కలబెట్టుకోవాలి. చివరలో కొత్తిమీర చల్లుకున్న వెజిటబుల్ జైపురి అన్నంలో కానీ చపాతీలో కాని తింటే రుచిగా ఉంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|