|
|
Articles: Poetry | చీమలు - Mr. gauri shankar chemudupati
| |
ఒకే గది నాది,
అదీ అస్థవ్యస్థమైన గది.
వస్తువులన్నీ చిందర వందరగా!
ఐనా, నాకు లేదు బెంగ!
మదిలోని వస్తువులన్నింటినీ
ఛిందరవందర పరిచింది నేనేగా!
నా సుఖం కోరి నేనలా చేశా!
అందులో ఓ సుఖముంది!
అంతా సర్దిపెడితే
కొత్తగా చేసేందుకేముంటుంది?
పేపరు చదివా
బల్లమీద విసిరేశా!
మందు తాగి
చెంచా టేబులు మీద వదిలేశా!
కొన్ని చీమలు చేరాయి
దాన్ని నాకి సుభ్రం చేశాయి!
అన్ని చీమలూ సయోధ్యగా
ఆ కాస్త తేనెను పంచుకున్నాయి!
మనలో లేని ఐకమత్యం
చీమల్లో చూసి చిరునవ్వు నవ్వుకున్నా!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|