|
|
Articles: Poetry | మందుపాతరపై ఇల్లు - Site Administrator
| |
(డా. మోపిదేవి విజయగోపాల్)
జాతి
భద్రంగా ఉందా
నా జాతి
ఛిద్రంగా ఉందా?
అంచులన్నీ
విద్రోహ తండాల
గుప్పిట్లో చిక్కుకున్న
నా జాతి భద్రంగా ఉందా?
కుర్చీలన్నీ
ధనదాహ మదోన్మత్తుల
కబ్జాలో చిక్కుకున్న
నా జాతి భద్రంగా ఉందా?
విశ్వవిద్యాలయ
జ్ఞాన కేంద్రాలన్నీ
విదేశీ మెదళ్ళతో నిండి ఉన్న
నా జాతి భద్రంగా ఉందా?
మెదళ్ళలో
తెల్లటి చెదపురుగులు
మొదళ్ళలో
అరువు ఎరువులు
వారాంతంలో
పబ్బుల కేళీవిలాసాలు
ఎన్నికలలో
నిరంతర ధనప్రవాహాలు
ఏక్షణమైనా ఎక్కడైనా
ఆత్మాహుతికి సిద్ధంగా ఉన్న
కుట్రదారుడు!
భద్రంగా ఉందా నా జాతి
నిద్రలో జోగుతోందా నా జాతి?
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|