|
|
Articles: Recipes | చిక్కుడు ఊరగాయ - Site Administrator
| |
కావలసిన పదార్ధాలు :
చిక్కుడు కాయ ముక్కలు : రెండు కప్పులు
చింతపండు గుజ్జు : ఒక కప్పు
కారం : అరకప్పు
ఉప్పు : పావు కప్పు
నూనె కప్పు
మెంతులు : నాలుగు టీ స్పూన్స్
పసుపు : టీ స్పూన్
మినపప్పు : టీ స్పూన్
సెనగపప్పు : టీ స్పూన్
కరివేపాకు : రెబ్బలు
వెల్లుల్లి పాయలు : రెండు
ఆవాలు : 3 టీ స్పూన్స్
జీలకర్ర : ఒక టీ స్పూన్
ఇంగువ : చిటికెడు
తయారు చేసే విధానం : చిక్కుడు కాయలను కడిగి పొడి బట్టతో తుడిచి ఆరబెట్టాలి. తర్వాత ఈనెలు తీసి చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. చింతపండు నానిన తర్వాత ఒక కప్పు గుజ్జుతీసి మందపాటి గిన్నెలో వేసి ఉడికించాలి. తర్వాత బాణలిలో నూనె పోసి ఆరిన చిక్కుడుకాయ ముక్కలను వేసి వేయించి తీసి చింతపండు గుజ్జులో వేయాలి. ఇప్పుడు మిగిలిన నూనెలో తాలింపు సామాను, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవాలి. ఈ తాలింపును చిక్కుడు కాయ ముక్కలకు కలిపి పొడిగా ఉన్న సీసాలో తడి తగలకుండా భద్రపరుచుకోవాలి. ఒక రోజు ఊరినాక తింటే బాగుటుంది. ఇది పది, పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|