|
|
Articles: Poetry | వస్తున్నాయొస్తున్నాయ్.. - Dr. Raghotham Reddy Pinninti
| |
చనిపోతే తప్ప చల్లారని పగలు
ఎంత సంపాదించుకున్నా తీరని ఆశలు
విడిపోతే తప్ప బతుకులేదనే ఆక్రందనలు
పేదోడికి ఏనాడూ అందని జీవనప్రమాణాలు
ఎందుకిలా? మూలమెక్కడ??
మనిషిలోని పక్షపాతం
ఒక్క జాతిగా ఏనాడూ ఒప్పుకోలేని జనం
కులం
మతం
ప్రాంతం... పేర్లతో అవసరాల కోసం ఒక్కటైపోవటం
ఆస్తుల విలువల కోసం
వారసుల భవిష్యత్ కోసం
గుంపులు గుంపులుగా బతకటం
వారి బతుకుల కోసం
బలహీనుడుకి, పేదోడికి జీవితమే లేకుండా
రాక్షస పాదంతో తొక్కివేయడం
అవసరం కోసం పొత్తులు
పాచిక పారకపోతే మాటల జిత్తులు
కలిసిపోవడం, విడిపోవడం..
పేదల బాగు కోసమనే పెద్ద మాటలు
చెప్పుకోవడానికే మాటలు,
రాసుకోవడానికే...ర౦కు బొంకులు
ఎన్నాళ్లు... ఈ మాయాజూదం
మీరు పెట్టిన మంటల్లో కాలిపోతున్న
బతుకులెవ్వరివి?
మీరు చేస్తున్న రాజకీయాలలో
ఎండిపోతున్న జీవితాలెవ్వరివి?
బలిసిపోయామని మురిసిపోకండి...
వస్తున్నాయి... వస్తున్నాయి...
జన ప్రవాహాలు
ఆక్రోశం నింపుకొని...
రాక్షస మూకల... సంహారానికి...
వస్తున్నాయి వస్తున్నాయి
ఆకలి కేకల మంటలు
మిమ్మల్ని కాల్చటానికి...
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|