TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
తెలంగాణ - ఆత్మహత్యలు
- Site Administrator
  Page: 1 of 5   Next > >  
(దుర్గం రవీందర్) తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదేమో అన్న అనుమానంతో గత రెండు నెలల్లో తెలంగాణలో 200 మంది విద్యార్థులు, యువకులు అన్యాయంగా మరణించారు. గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమాల్లో ఇలా ఆత్మహత్యల సంఘటనలు చోటుచేసుకోలేదు. యావత్ ప్రపంచంలోనే ఇలాంటి ఆత్మహత్యలు ఎక్కడా జరగడం లేదు. ఈ ఆత్మహత్యలను అందరూ నిరసించాల్సిందే. మానవీయ కోణంలో ఆలోచించే వారు అందరూ ఆత్మహత్యలను నిరసిస్తున్నారు. బహుశా కొందరు రాజకీయ వాదులు మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు కాబోలు. డిసెంబర్ మొదట్లో శ్రీకాంత్ చారి అనే విద్యార్థి మరణంతో ప్రారంభమైన తెలంగాణ యువకులు, విద్యార్థుల బలిదానాలు డిసెంబర్ 9 దాకా అడపాదడపా కొనసాగాయి. తర్వాత పలు పరిణామాల్లో ఆత్మహత్యలు పెరుగుతూ వచ్చాయి. తెలంగాణ ప్రాంతంలో మొదటి నుంచి ఇప్పటిదాకా (జనవరి 22 వరకు) దాదాపు 200 మరణాలు జరిగాయని ఉద్యమ నేతలు చెబుతున్నారు. వీరిలో కనీసం 100 మంది తెలంగాణ రాష్ట్ర అవతరణను కోరుతూ లేదా ప్రత్యేక రాష్ట్రం రాదన్న వేదనను వ్యక్తం చేస్తూ లేఖలు రాశారు. రానురాను ఈ ధోరణి మరింత పెరుగుతూ పోవడం ఆందోళన కలిగిస్తున్నది. విద్యార్థుల ఆత్మహత్యలు డిప్రెషన్ లో నుంచి యుఫోరియా వలన, సైకలాజికల్ స్ట్రెస్ వలన జరుగుతున్నాయని మానసిక శాస్త్రం తెలిసిన కొందరు చెప్తున్నారు. సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయంగా, వనరుల పరంగా పూర్తిగా పరాయీకరణం చెందాం అని భావించినందునే దిక్కుతోచని స్థితిలో తెలంగాణలో ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయని సామాజిక శాస్త్రం తెలిసిన వారు అంటున్నారు. మా వనరులు, సంస్కృతి మాకు కాకుండా పోయాయి, ఇంకా ఇలా మే బ్రతికి ఏం ప్రయోజనం అని భావించి వీరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నది వారి వివరణ. 'అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయి. ఈ ప్రాంత నాయకులు దళారులయ్యారు. వలస పాలకులతో చేతులు కలిపారు, సామాజికంగా గౌరవం లేదు' సమాజం కోసం పంట పండించే రైతు కరెంటు బిల్లులు అప్పు పడ్డాడని ఇంట్లో సామాన్లు తీసి బయట పెట్టినప్పుడు ఆ రైతు ఇజ్జత్ పోయిందని, ఇక ప్రాణాలతో పని ఏముందని భావించినందునే ఆత్మహత్యకు పాల్పడుతున్నాడని మరో భావన. సమాజం కోసం బట్టలు నేస్తూ భుక్తి పొంది గౌరవంగా బ్రతుకుదాం అనుకొనే నేతన్న, అలాగే నగలు, నట్రా చేసి మూడు పూటల తిండి సంపాదించుకుందాం అనుకునే విశ్వబ్రాహ్మణులు పూట గడవనందువల్లనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లక్షలోపు బకాయిలకు భయపడి ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలే ఎక్కువమంది ఉండటం గమనార్హం. వీటి కొనసాగింపుగానే తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని మరి కొందరు వివరిస్తున్నారు.

Read 1 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 5   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.