దూరంగా ఉంటే ఏమి
గుండెల్లో కొలువై ఉన్నావ్
దగ్గరగా లేవనుకుంటే
కనుకొలనులో కన్నీరవుతావ్
తొలకరి చిరుజల్లులాంటి
నీ ప్రేమని కురిపించావు
ఆ పై పెను ఉప్పెనంటి
విరహంలో ముంచావు
మనసన్నీ నేర్చింది
మర్చిపోవటం తప్ప
ఎడబాటుని తడబడకుండా
ఎదురుకోవటం తప్ప
ప్రతి స్పందన నీ కొరకే అని
గుండె తేల్చి చెప్పింది
చితివరకొచ్చే తోడిదిగో అని
నీ జ్ఞాపకాన్ని చూపింది.