నగరం రోడ్డుపైకొచ్చిన
దర్గాలూ దుర్గలూ
కనికరించి పక్కకి జరగరూ!
మమ్మీల ముందు
డాడీలంతా డమ్మీలే
జీవితమంటే
అరవడం, కరవడం కాదు
నవ్వడం, నవ్వించడం
రాయి రాయి నడుమ
ఆయనో రాయి
ఆయన్ని సేవిస్తే అదో హాయి
నగరాలన్నీ బాంబులతో
భయం భయం
పల్లెలూ పట్నాలే నయంనయం
ఆడదంటే...
జీరోని హీరో చేయడం
హీరోని సైతం జీరో చేయడం