|
|
Articles: Poetry | అరణ్య రాజకీయం - Mr. Narender Kumar Kulkarni
| |
రొట్టెముక్క దొరికిందని
చిట్టి ప్రాణులు
సంబరం చేసుకున్నాయి..
రొట్టె కూడా తనే మెక్కి బలవాలని
కొట్టంలో గడ్డిని కూడా వదిలి
దున్న ఒకటి పరుగెత్తింది..
మూలనున్న పందికొక్కు ఒకటి
ఉలిక్కిపడి లేచింది..
పోరునష్టంలో పొందే లాభం కోసం!
దూరంగా డేగకళ్ళు
తీక్షణంగా చూస్తున్నాయి
అదను కోసం!!
కుప్పిగంతులేసుకునే
కోతి ఒకటి
కప్పదూకుడు దూకింది...
కొలువు మీది సింహమేమో
మేకపోతుకు కబురెట్టింది..
'గాంభీర్యం' నేర్చుకోవటానికనుకుంటా..
గోతికాడ గుంటనక్క
తగవు చూడ వచ్చింది
తనివితీర నవ్వింది..
జిత్తులన్ని ప్రదర్శించి
నిప్పు రగలజేసింది...
అడవి తగలబడుతుందని
అరచి చెప్పాలనుకున్నవి కాకులు..
కాకుల కళ్ళనెవరో పొడిచారు..
...
ఎవరో చూస్తున్నారా మీరు??
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|