|
|
Articles: Poetry | రాజకీయం - Dr. Raghotham Reddy Pinninti
| |
చరిత్ర నిండా గాంధీగారే
అహింసకు అడ్డ్రస్సే లేదు
హింసకు లోటే లేదు
సిద్ధాంతాలను వదిలేసి
పేరు చెప్పుకుని బతకడం
పేరు తగిలించుకుని గెలవడం
ఆరు పదుల స్వతంత్ర భారతంలో
కూటీకీ.. గుడ్డకీ.. నీటిచుక్కకి
దిన దిన గండం
ఆవేశంలో ఒకడు
అవసరం కోసం ఇంకొకడు
కూలిన గోడలనే... మళ్లీ మళ్లీ కూలగొట్టడం
ప్రతి పనిలో.. మాటలో.. అడుగులో..
రాజకీయమె....
మరి మనమొ...!
రాజకీయాలు మనకొద్దనే డబ్బా కొట్టుకుంటూ
కుళ్ళిపోతున్న జీవితాలనే లాక్కుంటూ....
రాజకీయాలు మనకవసరం లేకపోవచ్చు...
రాజకీయాలకు... మన అవసరం ఉంది
అది.. తెలుసుకుందాం
మన పిల్లలను తెలుసుకోనిద్దాం
రాజకీయాలంటే...
జీవితాలను వదిలిపెట్టి
జెండాలు పట్టుకు వెళ్ళడం కానేకాదు
రాష్ట్రపతికి ప్రధానమంత్రికి
తేడా తెలియని పట్టభద్రులున్న
దౌర్భాగ్యం మనది
హాజరుపట్టి.. వేసుకుంటే తప్ప
పార్లమెంటుకు రాని
నాయకులున్న దేశం మనది
ఇకనయినా రాజకీయాలను తెలుసుకుందాం
భవిష్యత్తును బతికించుకుందాం
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|