|
|
Articles: Recipes | ఎగ్ ఫుడ్డింగ్ -
| |
కావలసినవి :
ఎగ్స్ : 6
పాలు : 1 లీటరు
పంచదార : 250 గ్రా
యాలకుల పొడి : కొద్దిగా
జీడిపప్పు, కిస్ మిస్ సరిపడా
నెయ్యి : రెండు స్పూన్స్
తయారు చేయు విధానం :
ముందుగా ఎగ్స్ ని బాగా బీట్ చేసుకోవాలి. లోతైన గిన్నెలో నెయ్యి వేసి వేడి అయిన తరువాత జీడిపప్పు, కిస్ మిస్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
పాలను బాగా మరిగించాలి. మరిగించిన పాలల్లో పంచదార కలిపి చల్లారనిచ్చి బీట్ చేసిన ఎగ్స్ ని యాలకుల పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని జీడిపప్పు , కిస్ మిస్ ఉన్న గిన్నెలో పోయాలి. ఫ్రెషర్ పాన్ లో ఒక గ్లాసు నీరు పోసి దానిలో ఈ మిశ్రమ గిన్నెను ఉంచి మూతపెట్టి విజిల్ పెట్టకూడదు. బాగా ఆవిరి వచ్చేటప్పుడు స్టవ్ ని సిమ్ లో ఒక పదినిమిషాలు ఉంచి స్టవ్ ని ఆఫ్ చెయ్యాలి.
ఇది చూడడానికి జున్నులా ఉంటుంది. దీన్ని వేరే గిన్నేలోకి వంచి బాగా చల్లారనిచ్చి ఫ్రిజ్ లో పెట్టాలి. చల్లబడిన తరువాత బౌల్ లో పెట్టి ఇవ్వాలి.
ఇది పిల్లలకు చాలా బలవర్దకమైన ఆహారం. ఫ్రిజ్ లో పెట్టకుండా కూడా తినవచ్చు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|