|
|
Articles: Drama | ప్రేమ దొంగలు... - Mr. GodDevendra GodDevendra
| |
ప్ర:-(ఫోనులో) హలో! లేడీస్ హాస్టలేనాండీ! ఎవరండీ మాటాడేది? ఓహ్ ! నేనా?. . .నేనూ . . నేను . . . డాక్టర్ ప్రకాష్ నండీ!(నవ్వి) మీరు భలే మాటాడతారండీ! ఎందుకేమిటండీ ఫోను చెయ్యటం? మా సుశీలతో మాటాడదామని. అర్రెర్రే! సుశీల లేదా? ఏమిటీ? మీ హాస్టల్ మొత్తానికే సుశీలనే అమ్మాయే లేదా?! అన్నట్టు మీ పేరేమిటన్నారు? (నవ్వి) ఓహ్ ! మీరింకా మీ పేరు చెప్పనే లేదు కదూ?! పేరడిగితే అంతకోపమెందుకండీ? పేరులోనేమి పెన్నిధుంది కనక? ఏవిటీ? చెప్పరా? పోన్లెండి అయితే, సుజాతని పిలవండి! ప్లీజ్ !. . (అవతల ఫోను పెట్టేసిన శబ్దం కాగా, ముఖం వాల్చి ఫోను క్రెడిల్ చేస్తాడు.)
(స్వగతంలో పైకే) ఇంత అందమైన పేర్లు సుశీలా-సుజాతా కాక ఈ హాస్టల్ లో ఇంకెవరుంటారబ్బా?! (గోడ నున్న ఓ సినీ హీరోయిన్ ఉన్న కాలెండరును తిరగేసి చూస్తాడు.దాని వెనుక అలిమేలు మంగా సమేత వెంకటరమణ చిత్రం ఉంటుంది. ప్రేక్షకులకి కనిపించదు. మనసారా నమస్కరించి,) ఆ(! -స్వచ్ఛమైన ఆంధ్ర దేశంలోని అందమైన అమ్మాయి పేరు-'తాయారమ్మ!'యస్. ఈ హాస్టల్లో తాయారుండనోపు.లెట్ మీ ట్రై !తాయారూ అయామ్ తయ్యార్ !! .. ఇంటి పేరడిగితే ఏం చెప్పేదబ్బా? ఆ(! ఏదో ఒకటి.డిక్షనరీలో యస్ తో బోలెడు పేర్లుంటాయి. యస్.అని చెప్పేస్తే సరి! యాస్ !(ఫోను రిసీవరు అందుకుని లేడీస్ హాస్టల్ కు డయల్ చేస్తాడు.) హలో లేడీస్ హాస్టలే కదండీ? ప్లీజ్ కొంచెం ఫోనుదగ్గరకి మా తాయారును పిలుస్తారూ? ఏమిటీ?!ఇద్దరు తాయార్లలో ఎవర్ని పిలవమంటారా?(చచ్ఛాం!). . . ఆవిడేనండీ! అదేనండీ! . . . యస్. యస్. అహ( . . . ఉహు(! అదే!యమ్.తాయారుగారేనండీ!ఆవిడ నా ఫోనుకోసం ఎదురు చూస్తుంటారు లెండి! (ఇంతలో ఏడు కొండలు ప్రవేశించును.)
ఏడు కొండలు:- ఏంటి గురూ!కాలేజెగ్గొట్టి పోన్లు దంచేత్తుండావ్. ట్రంకా?!
ప్ర:- ట్రంకూ లేదు పెంకూలేదు.నువ్వు నోరు మూసుకుని అవతలకు తగులడు.
ఏ:- అదేటిగురూ! అంత చికాకై పోతావ్ ? నీ రూమ్మేటేడీ?
ప్ర:- వల్లకాట్లోకెళ్లాడు.
ఏ:- ఇదెప్పుడు గురూ? నా తో సెప్పకుండానే?!
ప్ర:- ఏం?నువ్వూ వెళతావా? (ఫోను అవతలనించి మాట వినిపించినట్టుంది)హలో! గుడ్ మార్నింగ్ తాయారు గారూ! ఎక్సు క్యూజ్ మీ! నేనెవరంటారా? ఓ అభాగ్యుడ్ని! మీతో కనెక్షన్ తెచ్చుకునేసరికి తల ప్రాణం తోక్కొంచ్చిందంటే నమ్మండి. నా పేరా? నా పేరు ప్రకాశమండీ! నా పేరే ప్రకాసం గానండీ, నా బతుకంతా చీకటే నండీ! ఎందుకండీ- అలా నవ్వుతారు? నిజమండీ నేను చెప్పేది. నాపేరు సార్థకమై, మళ్లీ నాలో ప్రకాశం రావాలంటే, అందమైన మీ సాన్నిథ్యం కావాలండీ! (ఏడుకొండలు మాటలు వినాలని దగ్గరకొస్తాడు. ప్రకాశం తోసేస్తాడు.) ఏమిటండీ మీరు మరీ వేళాకోళం! మీరు చాలా-చాలా అందంగా వుంటారండీ! నాకు తెల్సు లెండి!(నవ్వి) అంతే లెండి! ఎవళ్లకి వాళ్లు తమకి తాము అందంగా లేమనే చెప్పుకుంటారు. (మళ్లీ ఏడుకొండలు ఆశగా దగ్గరకి రాబోతాడు. ప్రకాశం కాలు చెప్పు తీసి చూపిస్తాడు.)
ఏ:- (బిక్క చచ్చి)పోన్లే గురూ! నువ్వలా లవ్వు సేత్తుండూ; నానిలా సూత్తుంటాను. గోడకున్న సినీ హీరోయిన్ల ఫొటోలని చూస్తుంటాడు.)
ప్ర:- (ఫోనులో) హలో! ఒక్కసారి మీదర్శనం చేసుకుని మీతో మాటాడాలని ఉందండీ! ఏమిటీ? మాటాడ్డం కుదరదా? పోన్లెండి దర్శన భాగ్యమే చాలు. ఏమిటీ? నన్ను కూడా మీరు చూడాలనుకుంటున్నారా? థాంక్యూ! థాంక్యూవెరీ మఛ్! రెండు నిముషాల్లో సైకిలు మీద మీ హాస్టల్ ముందు వాల్తానండి. నన్ను మీరు ఇట్టే గుర్తు పట్టేయచ్చు. నాచేతిలోని రుమాలుని ఎగరేసి పట్టుకుంటాను. ఏవిటీ?..మీరు . . . గులాబీ పువ్వు వాసన చూస్తూ దర్శనమిస్తారా? థాంక్యూ . . . థాంక్యూ!! (ఫోను క్రెడిల్ చేసి గబగబా అద్దం దగ్గరకెళ్లి తలదువ్వుకుంటాడు, పౌడరు రాసుకుంటూంటాడు)
ఏ:- ఎవరుగురూ! ఆ తాయారు?!
ప్ర:- ... ... ...
ఇదుగో గురూ!నాకు సెప్పకుండా ఎడదామనుకుండావు కాబోలు. నేను 'హాచ్ఛ్ !' అని
తుమ్ముతాను. అప్పుడు టైరు లాటి నీగుండె బరస్టవుద్ది. నీ బండి సెల్ఫ్ కాదు. మెదడు మోకాల్లోకెల్లి కూకుంటాది.
ప్ర:- ఒరే!ఏడూ! . . . (బాధగా అంటాడు)
ఏ:- అద్గదీ అప్పుడు నువ్వు సేసే పని.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|