|
|
Articles: Drama | మానవతా మందిరం-2 - Mr. kompellaramakrishna murty
| |
లల్లీ: మేం నిన్ను నిదించామా! ఇంతకూ నువ్వెవరివి?
కాలం: నేనే కాలాన్ని, మీకొక ఇంద్రజాలాన్ని
ద్రోహం మీలో ఎవరుచేసినా
దోషిని మాత్రం నేనౌతున్నా /నేనే/
ఎల్లలు ఎరుగని మంచిని చూశా
కల్లాకపటం, స్వార్థం చూశా
మానవ చరితకు నేనే సాక్షిని
ఏ కళంకమూ అంటనిదానిని / నేనే/
కత్తులు దూసేదొకరు
ఆపత్తులు తెచ్చేదొకరు
వారు, వీరూ విషం కక్కినా
చివరకు నన్నే నిందిస్తారు /నేనే/
మోసెస్ :కాలమా! కాలమా! మమ్ము క్షమించు
మా వీథులకీ దుర్దశ ఏల వచ్చె వివరించు /కాలమా/
కరకు కత్తులను దూసే దుర్మతులెవరు?
పూలబాట ముళ్ళు నాటు ముష్కరులెవరు?
జన జీవన నిర్మల కాసారమంత కలచి కలచి
మా అందరి కాళ్ళకు సంకెళ్ళను వేసినదెవరు? /కాలమా/
కాలం: మానవులకు మానవుడే శత్రువు!
మానవుడే అనురాగ సింధువు!
దైవత్వం సాధిస్తే అతని మనసు అమృతం
దానవుడై గర్జిస్తే అతడే హాలాహలం /మానవులకు/
కొందరేమొ విరబూచిన పూలగుత్తులు
మరికొందరు కరుణలేని కరకు కత్తులు
మతసహనం మరచినపుడు ముప్పు తప్పదు
మీ ఇంట్లో మీరే బందీలు కాక తప్పదు /మానవులకు /
మోహన్ : మతమంటే అసలేమిటి?
అది నేర్పే పాఠం ఏమిటి?
హిందూ , ముస్లిం , క్రైస్తవ, బౌద్ధం
ఏది ఇందులో గొప్ప మతం?
ఏ సిద్ధాంతం అన్ని వేళలా
కలిగిస్తుందీ లోక హితం? /మతమంటే /
కాలం: మతమంటే దేవునిపై విశ్వాసం
మమతే అది మనకు నేర్పు గొప్ప పాఠం
మతములన్ని బోధించెను ప్రేమ తత్వము
అవి అన్నీ కాంక్షించెను శాంతిమార్గము
ఎదుట ఉన్న నదిని దాట వలసినప్పుడు
పుట్టైనా, పడవైనా ఒకటేరా తమ్ముడు /మతమంటే /
ద్వేషించుట నేర్పలేదు భగవద్గీత
కక్షలు రగిలించమనదురా ఖురాను
బైబిల్ విధ్వంస కాండ చేయమనదురా
గురుగ్రంథం క్రౌర్యాలను పెంచమనదురా /మతమంటే /
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|