|
|
Articles: Drama | మాతా పుత్ర విరోధాయ... - Mr. kompellaramakrishna murty
| |
సీతమ్మ: వాడెప్పుడు నా కంటికి పసివాడే బాబూ! చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. బరువంతా వాడి నెత్తిమీద పడింది. ఉన్న ఈ చారెడు నేలనీ గొడ్డులా దున్ని, ఇంత పండించి పోస్తున్నాడు. ఒక్కగానొక్క నలుసు - వాడే నా ప్రాణం బాబూ!
వీరయ్య: వాడికి మాత్రం నువ్వంటే పంచ ప్రాణాలు కాదూ? ఎప్పుడు, ఎక్కడ పలకరించినా 'మా అమ్మ, మా అమ్మా' అంటు నిన్నే నోట కట్టుకుంటూ మాట్లాడుతాడు.
సీతమ్మ: వెర్రి సన్నాసి, ఈ అమ్మ అంటే వాడికి వల్లమాలిన అభిమానం బాబూ! ఒక్క క్షణం నేను కనిపించకపోతే ఊపిరాడనట్టు విలవిల్లాడిపోతాడు. నేనా పండుటాకునై పోయాను.
రేపో, మాపో రాలిపోతాను. వాడేమైపోతాడో అనే నాబెంగ.
వీరయ్య: అప్పుడే నువ్వలాగంటే ఎలాగమ్మా? ఒక మంచి పిల్లను చూసి నారాయణకు పెళ్ళిచెయాలి, నాయనమ్మ అవ్వాలి. సంబంధాలేమన్నా చూస్తున్నావా?
సీతమ్మ: మీ ఇల్లు పదిళ్ళవాలి బాబూ.. మంచిమాట అడిగారు.
మొన్ననే, మన పక్క ఊళ్ళోనే ఒక సంబంధం ఖాయం చేశాను. పిల్ల కుందనపు బొమ్మ.
వీరయ్య: శుభం. త్వరలో పప్పన్నం పెడతావన్నమాట!
సీతమ్మ: అవును బాబూ! లగ్గం పెట్టుకోగానే మిమ్మల్ని కలుస్తాను.
వీరయ్య: మంచిది. అడుగో! నారాయణ వస్తున్నాడు. నేను వెళ్ళొస్తా.
సీతమ్మ: చిత్తం, నమస్కారం బాబూ!
(వీరయ్య వెళ్ళిపోగానే నారాయణ ప్రవేశించాడు)
నారాయణ: (తాను తెచ్చిన నాగలిని, పురుగుల మందుడబ్బాను క్రింద పెడుతూ) ఎందుకమ్మా ఇంత ఎండలో వచ్చావ్? కాసేపు ఆగితే నేనే వచ్చే వాడినికదా. చూడు నీ మొహమంతా వడిలిపోయింది!
అయ్యయ్యో .. కాళ్ళకు చెప్పులు కూడా లేవు. పాదాలు బొబ్బలెక్కాయి. కన్నతల్లికి ఏ సుఖమూ ఇవ్వలేని దరిద్రుడనైనందుకు బాధ పడుతున్నానమ్మా! భగవంతుడు నాకు ఏ కొంచెం ధనం ఇచ్చినా నిన్ను బంగారు పువ్వులతో పూజించనూ?
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|