TeluguPeople
  are the trend-setters

 
Articles: Literature
విధి వంచిత ద్రౌపది
- Mr. SATYANARAYANA PISKA
< < Previous   Page: 2 of 6   Next > >  
అమాయకంగా కుంతీ, మూర్ఖంగా పాండవులూ, అనుమానంగా ద్రుపదుడూ, విధి నిర్ణయంగా వ్యాసుడూ - ఆమె గుండెను ఐదు ముక్కలు చేశారు. ఆ ఐదు ముక్కలనూ కూడదీసుకుని, అతికి, రాయి చేసుకుని, మౌనంగా దాంపత్యజీవితంలోకి అడుగుపెట్టింది ద్రౌపది. ప్రేమించగల స్త్రీ మనస్సు ఇరుకు. అందులో ఒక్కడికే చోటు. ఒక్కరి చోటులో ఐదుగురు ఇమడటం ఎంత అసంభవమో, ఐదుగురు భర్తలను ఒక్క భార్య ప్రేమించటం కూడా అంత అసాధ్యం. ఇక్కడ ప్రేమ అంటే - అస్తిత్వపు లోలోతులను రగిలించే తృష్ణ, తృప్తి, త్యాగం, అర్పణ, ఆరాధన, తపన మొదలైన అనుభూతుల సమిష్టిశక్తి. ఇలాంటి శక్తికి ఆధారం కాగల పురుషుడొక్కడే ఉంటాడు స్త్రీ జీవితంలో - అని ప్రణయ మనస్తత్త్వాన్ని విశ్లేషించిన శాస్త్రజ్ఞులంటారు. ఒక్కరి విషయంలో మాత్రమే సాధ్యమయ్యే ప్రేమను ఐదుగురి విషయంలోనూ సాధ్యమనిపించింది ద్రౌపది. ఇది నిజమా?...కాదు. నటనా?...కాదు. జీవితానికీ, నటనకూ ఉన్న హద్దులు చెరిగిపోయి, నటించటమే ఊపిరిగా, ఊపిరిపీల్చడమే నటనగా మారిపోయిన బ్రతుకులోని విషాదాన్నీ, ఆ విషాదంలోని ఆకర్షణనూ చిత్రించటం నిజానికి, ఏ రచయితకూ సులువు కాదు - తిక్కన్నవంటి ఏ ప్రతిభావంతులకో తప్ప! ఏ జీవితాన్నైనా ఓ నాటకంగా దర్శించడం తిక్కన్నగారికి అలవాటు. ఏ వ్యక్తినైనా ఓ నాటకపాత్రగా నిర్మించడం వారి అభిరుచి. ఏ సన్నివేశాన్నైనా ఓ దృశ్యంగా భావించడం వారికి పరిపాటి. అందుకే తిక్కన్నగారి చేతిలో ద్రౌపది - ఓ అద్భుతమైన రూపకోచిత సృష్టి. *** *** *** 'పలు పోకల పోవుచు వి చ్చలవిడి నాట్యంబు సూపు చాడ్పున నిచటన్ కులసతుల గరువచందము తొలగగ నిట్లునికి తగునె?' అని ధర్మరాజే మందలించవలసి వచ్చేంత నాటకీయంగా ప్రవర్తించింది ఒకరోజు, విరాటుని నిండుకొలువులో కీచకుడు తనను తన్నినవేళ - తాను క్రింద పడిపోయినవేళ - ద్రౌపది! తన్నిన కీచకుడు అక్కడే నిలబడి ఉన్నాడు.

Be first to comment on this Article!

< < Previous   Page: 2 of 6   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2023 TeluguPeople.com, All Rights Reserved.